భక్తుల సమక్షంలో రామకల్యాణం: ఇంద్రకరణ్‌

ABN , First Publish Date - 2022-03-16T09:15:01+05:30 IST

భద్రాచలం సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవాన్ని ఈసారి భక్తుల సమక్షంలో వైభవంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు.

భక్తుల సమక్షంలో రామకల్యాణం: ఇంద్రకరణ్‌

హైదరాబాద్‌, మార్చి 15(ఆంధ్రజ్యోతి): భద్రాచలం సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవాన్ని ఈసారి భక్తుల సమక్షంలో వైభవంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా కల్యాణోత్సవాన్ని ఆలయ ప్రాంగణంలోనే నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ ఏడాది కల్యాణం కోసం మిథిలాస్టేడియాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. 

Read more