ఇచ్చిన హామీలను అమలు చేయాలి: కె.రాజిరెడ్డి

ABN , First Publish Date - 2022-11-25T03:56:30+05:30 IST

ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వానికి టీఎ్‌సఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

ఇచ్చిన హామీలను అమలు చేయాలి: కె.రాజిరెడ్డి

హైదరాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వానికి టీఎ్‌సఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. మునుగోడు ఉపఎన్నిక సమయంలో 2017 పీఆర్‌సీ అమలు చేయడానికి ఎన్నికలసంఘం అనుమతి కోరిన ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు జేఏసీ చైర్మన్‌ కె.రాజిరెడ్డి పేర్కొన్నారు. గప్రభుత్వ ఉద్యోగుల వేతనా లతో సమానంగా ఉండేలాగా ఫిట్‌మెంట్‌ ప్రకటించి 2017 ఏప్రిల్‌ నుంచి అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-11-25T03:56:30+05:30 IST

Read more