వస్తారు.. చంపేస్తారు.. అడ్డుకుంటే కేసులు పెడతారు.. ఇదీ ఆయన స్కెచ్: రఘురామ రాజు

ABN , First Publish Date - 2022-07-06T02:12:00+05:30 IST

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు (Raghuramakrishnam Raju)పై హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులు (Gachibowli Police) కేసు నమోదు చేశారు. ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ పీసీ బాషా ..

వస్తారు.. చంపేస్తారు.. అడ్డుకుంటే కేసులు పెడతారు.. ఇదీ ఆయన స్కెచ్: రఘురామ రాజు

న్యూఢిల్లీ (New Delhi): వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు (Raghuramakrishnam Raju)పై హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులు (Gachibowli Police) కేసు నమోదు చేశారు. ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ పీసీ బాషా (ap intelligence constable Pc Basha) ఇచ్చిన ఫిర్యాదు మేరకు రఘురామరాజుతో పాటు ఆయన కుమారుడు, భద్రతా సిబ్బందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులపై ఎంపీ రఘురామరాజు స్పందించారు.


‘‘అనుమానాస్పద వ్యక్తి నా ఇంట్లోకి వచ్చాడు.. సిబ్బంది ఆపి అడిగితే ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌ను అని చెప్పాడు. ఐడీ అడిగితే లేదని చెప్పారు. దాంతో గచ్చిబౌలి పోలీసులకు ఫోన్ చేశాం. వాళ్లు వచ్చి తీసుకెళ్లారు. కానీ ఇప్పుడు నాపై కేసు నమోదు చేశారు. ఇదంతా జగన్ మోహన్ రెడ్డి చేయించారు. సహజంగా జగన్ ది క్రిమినల్ నేచర్. ఎవరినైనా టార్గెట్ చేస్తే.. సైలెంట్‌గా పని కానిచ్చేస్తారు. ప్రశ్నిస్తున్నందున నాపై కక్ష కట్టారు.  కాకపోతే ఇప్పుడు పోలీసులతో చేయిస్తున్నారు. ఎవరూ పట్టించుకోకపోతే నన్ను చంపేసేవాడు.. నా సిబ్బంది అడ్డుకోవడంతో పోలీసు అని చెప్పి మాపైనే కేసులు నమోదు చేశారు. మేము పోలీసులకు అప్పగిస్తే మాపై కేసులేంటి?. ఏపీ మాదిరిగానే తెలంగాణలో కూడా రివర్స్ కేసులు పెడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్‌ (Telangana Cm Kcr)కి లేఖ రాశా. మంత్రి కేటీఆర్‌ (Minister Ktr)తోనూ మాట్లాడతాం. ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ మా ఇంటిలోకి వచ్చే విజువల్స్ ఉన్నాయి.. కోర్టును ఆశ్రయిస్తా. గతంలో కూడా నన్ను చంపేందుకు కుట్ర చేశారు. ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు.’’ అని  రఘురామ రాజు తెలిపారు. 
Read more