బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలి

ABN , First Publish Date - 2022-08-01T08:52:39+05:30 IST

బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని, బీసీల జనగణన చేపట్టాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ..

బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలి

 రేపటి నుంచి పార్లమెంటు ముందు ఆందోళనలు: ఆర్‌.కృష్ణయ్య

న్యూఢిల్లీ, జూలై 31(ఆంద్రజ్యోతి): బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని, బీసీల జనగణన చేపట్టాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 2, 3, 4, 9, 10, 11 తేదీల్లో దశల వారీగా పార్లమెంట్‌ ముందు ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వంలో 16లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు.  

Read more