కేంద్ర నిధులపై కేటీఆర్‌ సవాల్‌కు సై

ABN , First Publish Date - 2022-04-24T09:20:39+05:30 IST

రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులకు సంబంధించి మంత్రి కేటీఆర్‌ చేసిన సవాల్‌పై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు ప్రకటించారు.

కేంద్ర నిధులపై  కేటీఆర్‌ సవాల్‌కు సై

  • చర్చకు ఎక్కడైనా నేను సిద్ధం
  • ఏడేళ్లలో కేంద్రం 3.20 లక్షల కోట్లు ఇచ్చింది
  • బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులకు సంబంధించి మంత్రి కేటీఆర్‌ చేసిన సవాల్‌పై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు ప్రకటించారు. చర్చకు ఎక్కడైనా తాను రెడీ అని అన్నారు. శనివారం ఆయన ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌ కేంద్ర నిధులపై తప్పుడు వివరాలు వెల్లడించారన్నారు. గడిచిన ఏడేళ్లలో కేంద్రం వివిధ పథకాల కింద రాష్ట్రానికి రూ.3.20 లక్షల కోట్లు అందించిందని చెప్పారు. కాగా.. సిద్దిపేట జిల్లా అధికారులు ప్రొటోకాల్‌ను ఉల్లంఘిస్తున్నారని రఘునందన్‌రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. బీఆర్కే భవన్‌లో ఆయన సీఎ్‌సను కలిశారు. దుబ్బాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న తనను అగౌరవపరుస్తున్నారని, ఉద్దేశపూర్వకంగానే ఇలా జరుగుతోందని ఆరోపించారు.


రాజకీయ ఒత్తిళ్లతోనే సిద్దిపేట జిల్లా అధికారులు ప్రొటోకాల్‌ను పాటించడం లేదన్నారు. శంకుస్థాపన కార్యక్రమాలకు కావాలనే తనను ఆహ్వానించడం లేదని తెలిపారు. సీఎ్‌సను కలిసిన అనంతరం రఘునందన్‌ మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సెక్రటరీకి కూడా తనకు జరుగుతోన్న అవమానంపై ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ప్రభుత్వం ఇలాగే మొండివైఖరిన ప్రదర్శిస్తే...న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2022-04-24T09:20:39+05:30 IST