పీఆర్పీ చెల్లింపులకు అనుమతినివ్వాలి

ABN , First Publish Date - 2022-02-19T07:39:26+05:30 IST

2019-20 సంవత్సరానికి గాను సింగరేణి అధికారులకు

పీఆర్పీ చెల్లింపులకు అనుమతినివ్వాలి

  • సీఎంవోఏఐ వినతి


హైదరాబాద్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): 2019-20 సంవత్సరానికి గాను సింగరేణి అధికారులకు రావాల్సిన పనితీరు ఆధారిత పేమెంట్‌ (పర్ఫార్మెన్స్‌ రిలేటెడ్‌ పేమేంట్‌-పీఆర్పీ) చెల్లింపునకు అనుమతినివ్వాలని బొగ్గు గని అధికారుల సంఘం (సీఎంవోఏఐ) ప్రభుత్వాన్ని కోరింది. శుక్రవారం సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావుకు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జక్కం రమేష్‌, ఎన్‌.వి.రాజశేఖర్‌రావులు వినతిపత్రాన్ని అందించారు. ఫైలు ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలనలో ఉందని, దీన్ని వీలైనంత త్వరగా ఆమోదించాల్సిందిగా నివేదించారు. పీఆర్పీ కోసం దాదాపు 2300 మంది అధికారులు, విశ్రాంత అధికారులు ఎదురుచూస్తున్నారని గుర్తు చేశారు. 


Read more