గ్రామాల్లో వైద్య సేవలందించండి

ABN , First Publish Date - 2022-04-24T08:40:35+05:30 IST

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు విస్తృతం చేయాలని పీఈఎస్‌ యూనివర్సిటీ చాన్సలర్‌, కర్ణాటక ప్రభుత్వ విద్యా సంస్కరణల కమిటీ మాజీ సలహాదారు ప్రొఫెసర్‌ ఎంఆర్‌ దొరస్వామి పిలుపునిచ్చారు.

గ్రామాల్లో వైద్య సేవలందించండి

యువ డాక్టర్లకు పీఈఎస్‌ వర్సిటీ చాన్సలర్‌ దొరస్వామి పిలుపు 

హైదరాబాద్‌/బెంగళూరు, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు విస్తృతం చేయాలని పీఈఎస్‌ యూనివర్సిటీ చాన్సలర్‌, కర్ణాటక ప్రభుత్వ విద్యా సంస్కరణల కమిటీ మాజీ సలహాదారు ప్రొఫెసర్‌ ఎంఆర్‌ దొరస్వామి పిలుపునిచ్చారు. ఏపీలోని కుప్పం పీఈఎస్‌ మెడికల్‌ కళాశాల 14వ స్నాతకోత్సవం శుక్రవారం జరిగింది. 159 మంది ఎంబీబీఎస్‌, 60 మంది ఎండీ కోర్సులు పూర్తి చేసిన వారికి పట్టాలను ప్రదానం చేశారు. ఎంబీబీఎస్‌ టాపర్‌గా నిలిచిన విద్యార్థిని బృందను బంగారు పతకంతో సత్కరించారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులను ఉద్దేశించి దొరస్వామి మాట్లాడుతూ.. ఇప్పటివరకు కుప్పం పీఈఎ్‌సలో మూడు వేలమంది ఎంబీబీఎస్‌, ఎండీ కోర్సులు పూర్తి చేసి ప్రపంచమంతటా వైద్యసేవలు అందిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో పీఈఎస్‌ మెడికల్‌ డైరెక్టర్‌ సురేశ్‌, అసోసియేట్‌ మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రూపా సురేశ్‌, ప్రిన్సిపాల్‌, డీన్‌ కృష్ణారావు, మెడికల్‌ సూపరింటెండెంట్‌ చెన్నబసవ పాటిల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-04-24T08:40:35+05:30 IST