అంగన్‌వాడీల ఏర్పాటుకు నిధులివ్వండి:మంత్రి

ABN , First Publish Date - 2022-07-05T10:14:04+05:30 IST

రాష్ట్రంలో మరిన్ని అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన నిధులు కేంద్రం మంజూరు చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్‌ కోరారు.

అంగన్‌వాడీల ఏర్పాటుకు నిధులివ్వండి:మంత్రి

రాష్ట్రంలో మరిన్ని అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన నిధులు కేంద్రం మంజూరు చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్‌ కోరారు. 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవాల్ని పురస్కరించుకుని ఎనిమిదేళ్లలో కేంద్రం సాధించిన విజయాలపై కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో సోమవారం సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, మంత్రి సత్యవతి రాథోడ్‌తోపాటు ఇతర ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా  సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమానికి సంబంధించిన పలు అంశాల్ని గతంలో కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చామని, వాటిని పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అంగన్‌వాడీలో రెగ్యులర్‌ ఉదోగుల జీతాల వాటా కేంద్రం వాటాను 60ునికి పెంచాలని ఆమె విన్నవించారు. కరోనా కారణంగా మృతి చెందిన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులు, అంగన్‌వాడీ టీచర్లకు ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి స్మృతి ఇరానీని తెలంగాణ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతాలక్ష్మారెడ్డి కోరారు. 

Read more