సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపాలి

ABN , First Publish Date - 2022-11-07T23:09:56+05:30 IST

ప్రజావాణి కి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, సత్వరమే ప రిష్కరించాలని అదనపు కలెక్టర్‌ (లోకల్‌ బాడీ) ఆశిష్‌ సంగ్వాన్‌ అధికారులను ఆదేశించారు.

 సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపాలి
వినతులు స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

- అదనపు కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

వనపర్తి రాజీవ్‌ చౌరస్తా,నవంబరు7: ప్రజావాణి కి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, సత్వరమే ప రిష్కరించాలని అదనపు కలెక్టర్‌ (లోకల్‌ బాడీ) ఆశిష్‌ సంగ్వాన్‌ అధికారులను ఆదేశించారు. సోమ వారం జిల్లా కేంద్రంలోని ఐడీవోసీ సమావేశ మం దిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికి ఆయన హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ స మస్యల పరిష్కారంలో జాప్యం తగదని అధికారు లకు సూచించారు. కాగా పెన్షన్లకు సంబంధించి 9, ఇతర శాఖలకు సంబంధించి 25 మొత్తంగా 34 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

మునగమాన్‌దిన్నెను

నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలి

పెబ్బేరు రూరల్‌: మండలపరిధిలోని జనంపల్లి గ్రామ పంచాయతీలో ఉన్న మునగమాన్‌దిన్నె గ్రా మాన్ని పంచాయతీగా ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌కు వినతిపత్రం అందజేశారు. ఇందుకు జిల్లా అదనపు కలెక్టర్‌ స్పందిస్తూ వెంటనే జిల్లా పంచాయతీ అధికారిని పిలిచి దరఖాస్తును ప్రాసె స్‌ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో బీసన్న, బలరాం, గోవిందు, రాముడు, ఉమాకాంత్‌, చంద్ర కాంత్‌, శ్రీకాంత్‌, వెంకటన్న, లక్ష్మన్న పాల్గొ న్నారు.

అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో

విస్తరణ పనులకు తూట్లు

వనపర్తి టౌన్‌ : రోడ్డు విస్తరణ పనులను అధి కారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వలన వెడల్పు పను లకు తూట్లు పడుతున్నాయని అఖిలపక్ష ఐక్యవే దిక నాయకులు విమర్శించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో అదనపు కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ ను కలిసి విస్తరణ పనుల లో జరుగుతున్న అవకతవకలపై వినతిపత్రం అం దజేశారు. కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక నా యకులు వెంకటేష్‌, జానంపేట రాములు, రమేష్‌, అడ్వకేట్‌ ఆంజనేయులు, గోపాలకృష్ణ నాయుడు, శ్రీనివాసులు, రాములు,తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-07T23:09:56+05:30 IST

Read more