ఆస్పత్రిలో ప్రైవేటు మెడికల్‌ షాపులను తొలగించాలి

ABN , First Publish Date - 2022-11-19T00:47:35+05:30 IST

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ప్రైవేటు మెడికల్‌ షాపులను వెంటనే తొలగించాలని ఎన్‌ఎస్పీ నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జి బకరం శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆస్పత్రి ఆవరణలో శుక్రవారం నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆస్పత్రిలో కొందరు అనధికారికంగా జనరిక్‌ మందుల షాపులు నిర్వహిస్తున్నారని, వాటిని తక్షణమే తొలగించాలన్నారు.

ఆస్పత్రిలో ప్రైవేటు మెడికల్‌ షాపులను తొలగించాలి

నల్లగొండ అర్బన్‌, నవంబరు 18: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ప్రైవేటు మెడికల్‌ షాపులను వెంటనే తొలగించాలని ఎన్‌ఎస్పీ నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జి బకరం శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆస్పత్రి ఆవరణలో శుక్రవారం నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆస్పత్రిలో కొందరు అనధికారికంగా జనరిక్‌ మందుల షాపులు నిర్వహిస్తున్నారని, వాటిని తక్షణమే తొలగించాలన్నారు. కొందరు అధికారుల అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా మెడికల్‌ షాపులు నిర్వహిస్తూ రోగుల నుంచి అధిక మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో మందుల సరఫరాలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని, ఉన్నతాధికారులు విచారణ నిర్వహించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కర్నాటి యాదగిరి, మల్లేష్‌ యాదవ్‌, కొండేటి మురళి, బొజ్జ దేవయ్య, కత్తుల సన్ని, వెంకటయ్య, కొంపల్లి రామన్న, రమేష్‌, రామకృష్ణ, పాల్గొన్నారు.

Updated Date - 2022-11-19T00:47:39+05:30 IST