నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

ABN , First Publish Date - 2022-02-23T12:10:13+05:30 IST

భీమ్లా నాయక్‌ చిత్రం ప్రీ రిలీజ్‌ కార్యక్రమం సందర్భంగా ట్రాఫిక్‌ మళ్లింపులు విధిస్తున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ ప్రకటించారు.

నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌ సిటీ/బంజారాహిల్స్‌: భీమ్లా నాయక్‌ చిత్రం ప్రీ రిలీజ్‌ కార్యక్రమం సందర్భంగా ట్రాఫిక్‌ మళ్లింపులు విధిస్తున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ ప్రకటించారు. యూసు్‌ఫగూడలోని 1వ టీఎ్‌సఎ్‌సపీ బెటాలియన్‌ గ్రౌండ్స్‌లో బుధవారం సాయంత్రం జరగనున్న వేడుకకు ప్రముఖులు హాజరు కానున్నారు. ట్రాఫిక్‌ జాం సమస్య ఏర్పడే అవకాశమున్నందున మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 11 వరకు ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయి. నిర్వాహకులు జారీ చేసిన పాసులు ఉన్న వారికే అనుమతి ఉంటుందని తెలిపారు. 

Read more