వర్షాలు తగ్గాలని పూజలు చేయండి

ABN , First Publish Date - 2022-07-14T08:56:46+05:30 IST

వర్షాలు తగ్గేందుకు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ దేవాదాయశాఖ అధికారులను బుధవారం ఆదేశించారు.

వర్షాలు తగ్గాలని పూజలు చేయండి

  • దేవాదాయ అధికారులకు సీఎం ఆదేశం
  • ముంపు గ్రామాల ప్రజలను తరలించండి
  • రక్షణ చర్యలు కొనసాగించండి
  • విద్యుత్తు సరఫరాకు ఆటంకం వద్దు
  • వీలైన చోట్ల జల విద్యుత్తు ఉత్పత్తి 
  • అత్యవసరమైతేనే ప్రజలు బయటకు
  • వర్షాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష
  • అధికారులు, మంత్రులకు ఫోన్లో ఆదేశాలు


హైదరాబాద్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): వర్షాలు తగ్గేందుకు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ దేవాదాయశాఖ అధికారులను బుధవారం ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌.. జోగులాంబ, భద్రకాళి, వేములవాడ తదితర ఆలయాల్లో వరుణ దేవుడ్ని ప్రార్థిస్తూ ‘ఓం సహస్ర నేత్రాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి తన్నో ఇంద్ర ప్రచోదయాత్‌’ అనే మంత్రం పఠించాలని అసిస్టెంట్‌ కమిషనర్లు, ఆలయ కార్య నిర్వహణాధికారులను ఆదేశించారు. కాగా, అంతకు ముందు కేసీఆర్‌ తెలంగాణ అర్చక సమాఖ్య వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గంగు ఉపేంద్ర శర్మతో ఫోన్‌లో మాట్లాడి వరుణ దేవుడ్ని శాంతింపజేసేందుకు పూజలపై చర్చించారు. 

Updated Date - 2022-07-14T08:56:46+05:30 IST