జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో పనిచేయనున్నపీకే

ABN , First Publish Date - 2022-04-24T21:06:16+05:30 IST

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కలిసి పనిచేయనున్నారు.

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో పనిచేయనున్నపీకే

హైదరాబాద్: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కలిసి పనిచేయనున్నారు. అలాగే తెలంగాణలో ఐప్యాక్ పని చేస్తుందని తెలిపారు. ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో ప్రశాంత్ కిషోర్ జరిగిన భేటీ ముగిసింది. అనంతరం సీఎం కేసీఆర్‌తో పాటు పీకే కూడా ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లినట్టు సమాచారం. ఆదివారం సాయంత్రం లేదా సోమవారం ఉదయం ప్రశాంత్ కిషోర్ ఢిల్లీకి బయలు దేరి వెళ్లనున్నారు. రెండ్రోజులుగా దేశ, రాష్ట్ర రాజకీయాలపై కేసీఆర్‌తో పీకే చర్చలు జరిపారు. ప్రశాంత్ కిషోర్ టీమ్ తెలంగాణలో సర్వేలు చేస్తోంది. శనివారం నుంచి పీక ప్రగతిభవన్‌లోనే పీకే మకాం వేశారు.  కేసీఆర్, పీకే మధ్య వరుస సమావేశాలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చమొదలైంది. ఇప్పటికే రాజకీయ, పాలన పరిస్థితులపై పీకే టీమ్‌ సర్వేనిర్వహిస్తోంది. 

Read more