సీఎం కేసీఆర్ మేడ్చల్ జిల్లా టూర్.. షెడ్యూల్ ఇదే...!

ABN , First Publish Date - 2022-08-17T02:52:45+05:30 IST

మేడ్చల్ జిల్లాలో సీఎం కేసీఆర్ బుధవారం పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు ఆయన ...

సీఎం కేసీఆర్ మేడ్చల్ జిల్లా టూర్.. షెడ్యూల్ ఇదే...!

హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలో సీఎం కేసీఆర్ (Cm Kcr) బుధవారం పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు ఆయన ప్రగతి భవన్ (Pragati Bhavan) నుంచి బయలుదేరి మేడ్చల్ (Medchal) వెళ్లనున్నారు. 2 గంటల 55 నిమిషాలకు మేడ్చల్ జిల్లా అంతాయిపల్లికి కేసీఆర్ చేరుకోనున్నారు. అనంతరం అక్కడ నిర్మించిన సమీకృత కలెక్టరేట్ (Collectorate) భవనాన్ని ఆయన ప్రారంభించనున్నారు. రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించి, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత భవనాన్ని పూర్తిగా పరిశీలించనున్నారు. అనంతరం 3 గంటల 45 గంటలకు అంతాయిపల్లి నుంచి IDOC పరేడ్ గ్రౌండ్‌కు చేరుకోనున్నారు. 3.55 గంటలకు బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. సాయంత్రం 5 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 5.40 గంటలకు తిరిగి ప్రగతి భవన్‌కు చేరుకోనున్నారు. 


Read more