కరీంనగర్‌ పోలీ్‌సలకు పీపీసీ నోటీసులు

ABN , First Publish Date - 2022-04-10T07:18:28+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌పై దాడి, అక్రమ

కరీంనగర్‌ పోలీ్‌సలకు పీపీసీ నోటీసులు

కరీంనగర్‌ క్రైం, ఏప్రిల్‌ 9: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌పై దాడి, అక్రమ అరెస్టు కేసులో కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ వీ.సత్యనారాయణకు పార్లమెంట్‌ ప్రివిలేజ్‌ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న మధ్యాహ్నం 1.30 గంటలకు న్యూఢిల్లీలో తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. కరీంనగర్‌ సీసీఎస్‌ ఏసీపీ కే.శ్రీనివాస్‌, హుజూరాబాద్‌ ఏసీపీ కోట్ల వెంకట్‌ రెడ్డి, జమ్మికుంట సీఐ కొమ్మనేని రాంచంద్రారావు, హుజూరాబాద్‌ సీఐ వీ.శ్రీనివాస్‌, కరీంనగర్‌ ఒకటో ఠాణా సీఐ చల్లమల్ల నటేశ్‌కు కూడా నోటీసులిచ్చిన కమిటీ.. వాటి ప్రతిని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌కు పంపింది. 

Read more