బల్కంపేటలో సీఎం సతీమణి పూజలు

ABN , First Publish Date - 2022-10-03T09:54:43+05:30 IST

దేవీ శరన్నవరాత్రి, బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకుని సీఎం కేసీఆర్‌ సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవితలు బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి సతీమణి జన్మదినం సందర్భంగా..

బల్కంపేటలో సీఎం సతీమణి పూజలు

ఎల్లమ్మ ఆలయంలో బతుకమ్మ ఆడిన కవిత


అమీర్‌పేట, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): దేవీ శరన్నవరాత్రి, బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకుని సీఎం కేసీఆర్‌ సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవితలు బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి సతీమణి జన్మదినం సందర్భంగా ఆదివారం ఆలయానికి వెళ్లిన వీరికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అమ్మవారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో కవిత మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఎల్లమ్మను కోరుకున్నానని తెలిపారు.

Read more