Munugodeలో ఎన్నడూ లేనంతగా పెరుగుతున్న పొలిటికల్ హీట్..

ABN , First Publish Date - 2022-08-17T16:32:27+05:30 IST

మునుగోడులో పొలిటికల్ హీట్(Political heat) పెరుగుతోంది. బీజేపీ(BJP).. ఆపరేషన్ ఆకర్ష్‌కు మరింత పదును పెడుతోంది.

Munugodeలో ఎన్నడూ లేనంతగా పెరుగుతున్న పొలిటికల్ హీట్..

Nalgonda : మునుగోడులో పొలిటికల్ హీట్(Political heat) పెరుగుతోంది. బీజేపీ(BJP).. ఆపరేషన్ ఆకర్ష్‌కు మరింత పదును పెడుతోంది. టీఆర్ఎస్(TRS) సైతం చేరికలపై దృష్టి సారించింది. నేడు అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీల్లో మునుగోడు నియోజకవర్గానికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు చేరబోతున్నారు. ఇటు మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy) ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ పార్టీలో మర్రిగుడెం మండల కాంగ్రెస్ పార్టీ(Congress Party) వైస్ ఎంపీపీ వెంకటేష్, లెంకెలపల్లి సర్పంచ్ పాక నాగేష్ యాదవ్, సరంపేట సర్పంచ్, ఎంపీటీసీ శ్రీశైలం చేరనుండగా.. అటు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etela Rajender) ఆధ్వర్యంలో చండూరు మండలానికి చెందిన 10 మంది టీఆర్‌ఎస్ సర్పంచ్‌లు చేరబోతున్నారు.


బీజేపీకి ఫేవర్‌గానే సంకేతాలు..


ఈ చేరికలు చూస్తుంటే అంతో.. ఇంతో అక్కడ టీఆర్ఎస్ గెలుస్తుందన్న ఆశలు సైతం గల్లంతయ్యేలా ఉన్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరికతో ఏమాత్రం పట్టులేని నల్గొండ నియోజకవర్గంలో బీజేపీకి పట్టు లభించినట్టైంది. ఇక అందిన అవకాశాన్ని జార విడుచుకోకుండా బీజేపీ సైతం పట్టును మరింత బిగిస్తోంది. దీనిలో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్. ఆపై నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలను కలుపుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) ముందుకు వెళుతున్నారు. మునుగోడు నుంచి వెలువడుతున్న సంకేతాలన్నీ బీజేపీకి ఫేవర్‌గానే ఉన్నాయి. ఈ క్రమంలోనే బీజేపీని నమ్మితే ఏమవుతుందో సీఎం కేసీఆర్(CM KCR) ఉదాహరణలతో సహా చెప్పి ప్రజల మనసు మార్చే యత్నం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటి వరకూ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది లేదు.


బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీ ఫ్లెక్సీలు, హోర్డింగ్స్..


జనగామలో బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీ ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. బండి సంజయ్‌కు సవాల్ విసురుతూ టీఆర్‌ఎస్‌ హోర్డింగ్స్ పెట్టింది. జనగామలో అడుగుపెట్టాలంటే.. నీతి ఆయోగ్ సిఫారసు చేసిన నిధులు తీసుకురావాలని డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి హోర్డింగ్స్‌ఏర్పాటు చేశారు. బండి సంజయ్‌ పాదయాత్రకు స్వాగతం పలుకుతూ బీజేపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. కొన్ని బీజేపీ ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చింపేశారు. టీఆర్ఎస్ నాయకులే చింపేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోటా పోటీ విమర్శలు, ఫ్లెక్సీల నేపథ్యంలో హై టెన్షన్ నెలకొంది.


Updated Date - 2022-08-17T16:32:27+05:30 IST