TS News: పోలీసులు అడ్డుకోవడం దారుణం ..భట్టి విక్రమార్క

ABN , First Publish Date - 2022-08-17T00:44:57+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం: గోదావరి వరద ముంపు బాధితులను పరామర్శించడానికి వెళ్లిన తమ పార్టీ బృందాన్ని పోలీసులు అడ్డుకోవడం దారుణమని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో.. ప్రతిపక్షపార్టీ

TS News: పోలీసులు అడ్డుకోవడం దారుణం ..భట్టి విక్రమార్క

భద్రాద్రి కొత్తగూడెం: గోదావరి వరద ముంపు బాధితులను పరామర్శించడానికి వెళ్లిన తమ పార్టీ బృందాన్ని పోలీసులు అడ్డుకోవడం దారుణమని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో.. ప్రతిపక్షపార్టీ కాంగ్రెస్‌కు అంతే బాధ్యత ఉంటుందన్నారు. వరద బాధితుల సమస్యలు, బాధలను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో తప్పేముందన్నారు. 75వ స్వాతంత్ర వేడులకు రూ. కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వానికి.. గోదావరి వరద ముంపు ప్రాంత ప్రజల గోడు పట్టదా? అని ప్రశ్నించారు. తమ బృందంలో టెర్రరిస్టులు లేరని, సంఘ విద్రోహ శక్తులు కామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే తమకు భద్రత కల్పించి.. ప్రజల వద్దకు తీసుకువెళ్లాల్సింది పోయి పోలీసులను పెట్టి అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం సరి కాదన్నారు.  

Updated Date - 2022-08-17T00:44:57+05:30 IST