26న తెలంగాణకు ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2022-05-19T03:11:58+05:30 IST

ప్రధాని మోదీ ఈ నెల 26న హైదరాబాద్ రానున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడులైంది. హైదరాబాద్ పర్యటనలో....

26న తెలంగాణకు ప్రధాని మోదీ

హైదరాబాద్: ప్రధాని మోదీ ఈ నెల 26న హైదరాబాద్ రానున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడులైంది. హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ISB వార్షికోత్సవంలో పాల్గొననున్నారు. దీంతో ప్రధాని మోదీకి ఘనంగా స్వాగతం పలికేందుకు కమలనాథుడు సిద్ధమవుతున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు భారీగా తరలి వెళ్లి ప్రధానిని రిసీవ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 


ఇక ప్రధాని మోదీ తొలుత ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ బీజేపీ నేతలతో సమావేశం అవుతారు. అనంతరం రామగుండం ఎరువుల కర్మాగారాన్ని వర్చువల్ ద్వారా ప్రధాని ప్రారంభించే అవకాశం ఉంది.  ఆ తర్వాత ఇఫ్లుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 

Read more