పీహెచ్‌డీ కేటగిరి-1 దరఖాస్తు గడువు 20

ABN , First Publish Date - 2022-01-03T16:50:48+05:30 IST

కాకతీయ యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ విభాగాలలో కేటగిరి-1 పీహెచ్‌డీ 2021-22 ఏడాదికిగానూ అడ్మిషన్ల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు ..

పీహెచ్‌డీ కేటగిరి-1 దరఖాస్తు గడువు 20

కేయూ క్యాంపస్‌, జనవరి 2: కాకతీయ యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ విభాగాలలో కేటగిరి-1 పీహెచ్‌డీ 2021-22 ఏడాదికిగానూ అడ్మిషన్ల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు గడువును జనవరి 20వ తేదీ వరకు ఉందని కేయూ  ఇంజనీరింగ్‌ డీన్‌ ప్రొఫెసర్‌  టి.శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయస్థాయిలోని యూజీసీ-జేఆర్‌ఎఫ్‌, ఐసీఎస్‌ఎస్‌ఆర్‌, ఆర్‌జీఎన్‌ఎఫ్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌, క్యూఐసీ. ఎఫ్‌ఐపీ, ఎన్‌ఎఫ్‌ఎస్టీ, ఐసీహెచ్‌ఆర్‌, సాధించిన అభ్యర్థులు తమ రీసెర్చీ ప్రాపోజల్‌తో జనవరి 20 సాయంత్రం 5గంటల లోపు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు రూ. 2వేలు, ఇతర అభ్యర్థులందరికీ రూ. 3వేల ఫీజు చెల్లించి కేయూ క్యాంపస్‌లోని డీన్‌ కార్యాలయంలో దరఖాస్తులు అందచేయాలని ఉత్త్తర్వుల్లో పేర్కొన్నారు. ఇతర వివరాలకు https://kakatiya.ac.in  మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌లో చూడలని కోరారు.

Read more