అబ్దాహూ కశఫ్‌‌పై పీడీయాక్ట్‌

ABN , First Publish Date - 2022-08-31T09:23:56+05:30 IST

ఇటీవల హైదరాబాద్‌లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి, ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన సయ్యద్‌ అబ్దాహూ ఖాద్రీ(27) అలియాస్‌ కశఫ్‌ వ్యక్తిపై సిటీ పోలీసులు పీడీయాక్ట్‌ నమోదు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు.

అబ్దాహూ కశఫ్‌‌పై పీడీయాక్ట్‌

మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశాడని అదుపులోకి

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ఇటీవల హైదరాబాద్‌లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి, ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన సయ్యద్‌ అబ్దాహూ ఖాద్రీ(27) అలియాస్‌ కశఫ్‌ వ్యక్తిపై సిటీ పోలీసులు పీడీయాక్ట్‌ నమోదు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఓల్డ్‌ మలక్‌పేట్‌ ప్రాంతానికి చెందిన కశఫ్‌ కొంతకాలంగా అభ్యంతరకర రీతిలో వీడియోలు చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నాడు. అతడు మత కలహాలను రెచ్చగొట్టేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్రవర్తిస్తున్నాడని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత వారం ఎమ్మెల్యే రాజాసింగ్‌ వివాదాస్పద వీడియో వైరల్‌ అయిన తర్వాత.. కశ్‌ఫతో పాటు అతని మద్దతుదారులు ఆగస్టు 22 రాత్రి పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ముందు ధర్నా చేశారు. రాజాసింగ్‌ను అరెస్టు చేయాలని, ప్రవక్తను అవమానపరిచిన వారి తల తీసేయాలని కశఫ్‌ నినాదాలు చేశాడు. ఆ వీడియోలు వైరల్‌గా మారిన తర్వాత హైదరాబాద్‌లో నిరసన కార్యక్రమాలు పెరిగాయని పోలీసులు తెలిపారు.

Read more