ట్రేడ్ లైసెన్స్ ఫీజు పెంపును సవాలు చేస్తూ పిటిషన్
ABN , First Publish Date - 2022-11-30T04:10:04+05:30 IST
వ్యాపారులకు జారీచేసే ట్రేడ్ లైసెన్స్ ఫీజును భారీగా పెంచుతూ మున్సిపల్ శాఖ జారీ చేసిన జీవో నెంబర్ 147ను సవాల్ చేస్తూ ఖమ్మంకు చెందిన శ్రీశ్రీశ్రీ ఆటోమొబైల్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

వ్యాపారులకు జారీచేసే ట్రేడ్ లైసెన్స్ ఫీజును భారీగా పెంచుతూ మున్సిపల్ శాఖ జారీ చేసిన జీవో నెంబర్ 147ను సవాల్ చేస్తూ ఖమ్మంకు చెందిన శ్రీశ్రీశ్రీ ఆటోమొబైల్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కొత్తగా జారీచేసిన జీవో ప్రకారం ఇచ్చిన డిమాండ్ నోటీసులు కొట్టేయాలని కోరింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డిల ధర్మాసనం.. వివరణ ఇవ్వాలని మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శికి, ఖమ్మం మున్సిపల్ కమిషనర్‌కు నోటీసులు జారీచేసింది.
Read more