భవనంపై నుంచి కిందపడి కార్మికుడు మృతి

ABN , First Publish Date - 2022-04-05T15:19:14+05:30 IST

శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మధుర నగర్ కాలనీలో ఐదు అంతస్థుల భవనంపై నుంచి కిందపడి నాగరాజు అనే కార్మికుడు మృతి చెందాడు.

భవనంపై నుంచి కిందపడి కార్మికుడు మృతి

శంషాబాద్ : శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మధుర నగర్ కాలనీలో ఐదు అంతస్థుల భవనంపై నుంచి కిందపడి నాగరాజు అనే కార్మికుడు మృతి చెందాడు. నిర్మాణంలో ఉన్న భవనానికి పెయింటింగ్ చేస్తూ కింద పడిపోయాడు. తోటి కార్మికులు గమనించి హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నాగరాజు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Read more