పెండింగ్‌లో ‘కాస్మెటిక్‌’ ప్రతిపాదనలు

ABN , First Publish Date - 2022-08-17T09:49:04+05:30 IST

సంక్షేమ హాస్టళ్లలో పేద విద్యార్థులకు చెల్లిస్తున్న కాస్మెటిక్‌ చార్జీలను పెంచాలని బీసీ సంక్షేమ శాఖ పంపిన ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.

పెండింగ్‌లో ‘కాస్మెటిక్‌’ ప్రతిపాదనలు

ప్రభుత్వ పరిశీలనలోనే బీసీ సంక్షేమ శాఖ సూచనలు

హైదరాబాద్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): సంక్షేమ హాస్టళ్లలో పేద విద్యార్థులకు చెల్లిస్తున్న కాస్మెటిక్‌ చార్జీలను పెంచాలని బీసీ సంక్షేమ శాఖ పంపిన ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కాస్మెటిక్‌ చార్జీలను చెల్లించాలని, ప్రస్తుతం ఇస్తున్న పైసలు ఏమాత్రం సరిపోవడం లేదని బీసీ సంక్షేమ శాఖ సర్కారు దృష్టికి తీసుకెళ్లింది. అయితే, ఆ సూచనలు ప్రభుత్వ పరిశీలనలోనే ఉండిపోయాయి. సంక్షేమ వసతి గృహాల్లో చదువుకుంటున్న బాలురకు రూ.62, బాలికలకు రూ.75 చొప్పున సర్కారు ప్రతి నెల కాస్మెటిక్‌ చార్జీలను చెల్లిస్తోంది. 14 ఏళ్ల క్రితం నిర్ణయించిన ధరలనే ఇప్పటికీ ఇస్తుండటంతో పిల్లలు సొంత డబ్బులతో సబ్బులు, పేస్టులు కొనుక్కుంటున్నారు. సర్కారు ఇస్తున్న చార్జీలు తమకు ఏమాత్రం సరిపోవడం లేదని వాపోతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా బాలురకు రూ.200, బాలికలకు రూ.250 చెల్లించాలని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు రాజశేఖర్‌ డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-08-17T09:49:04+05:30 IST