ఓపెన్‌ ఎయిర్‌ జైల్‌కు గ్రీన్‌సిగ్నల్‌

ABN , First Publish Date - 2022-10-01T05:28:38+05:30 IST

ఓపెన్‌ ఎయిర్‌ జైల్‌కు గ్రీన్‌సిగ్నల్‌

ఓపెన్‌ ఎయిర్‌ జైల్‌కు  గ్రీన్‌సిగ్నల్‌


వ్యవసాయ క్షేత్రం,  కుటీర పరిశ్రమలు...

కోళ్లు, గొర్రెల పెంపకం, డెయిరీ, నర్సరీల ఏర్పాటు

చర్లపల్లి తర్వాత రెండో జైలు

మామునూరులో త్వరలో పనులు ప్రారంభం

వరంగల్‌ క్రైం, సెప్టెంబరు 30: వరంగల్‌ జిల్లాలో ఓపెన్‌ ఎయిర్‌ జైలు ఏ ర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మామునూరు పోలీస్‌ బెటాలియన్‌లో సెంట్రల్‌ జైలు నిర్మాణానికి కేటాయించిన 101 ఎకరాల స్థలంలో ఓపెన్‌ఎయిర్‌ జైలు నిర్మించాలంటూ ఆదేశాలు జారీ చేసిం ది. ఓపెన్‌ఎయిర్‌ జైలు ఏర్పాటులో భాగంగా వ్యవసాయ క్షేత్రం, ఫర్నిచర్‌ ఫ్యాక్టరీ, ఫినాయిల్‌ యూనిట్‌తోపాటు కోళ్లు, గొర్రెలు, బర్రెల పెంపకం, నర్సరీ ని నిర్వహించాలంటూ ఉత్తర్వులో పేర్కొంది. ఈ నేపథ్యంలో త్వరలో పను లు ప్రారంభించేందుకు జైలు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

సెంట్ర ల్‌ జైల్‌ బదులుగా... 

గతేడాది ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరంగల్‌ పర్యటనలో భాగంగా సెంట్రల్‌ జైల్‌ స్థానంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని నిర్ణయించారు. సెం ట్రల్‌ జైలును తొలగించి వెంటనే ఆస్పత్రి నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా మామునూరు పోలీస్‌ బెటాలియన్‌లోని 101ఎకరాల స్థలాన్ని నూతన సెంట్రల్‌ జైలు నిర్మాణానికి కేటా యించారు. అయితే ఏడాది గడుస్తున్నా సెంట్రల్‌ జైలు నిర్మాణానికి ప్రభు త్వం నిధులు విడుదల చేయని కారణంగా ఎలాంటి పురోగతి లేకుండా పో యింది. ఒకానొక దశలో నిర్మాణం కలేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో జైలుకు కేటాయించిన స్థలంలో ఓపెన్‌ ఎయిర్‌ జైలు నిర్మించాలం టూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. 

చర్లపల్లి తర్వాత ఇక్కడే... 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా హైదరాబాద్‌ చర్లపల్లి సెంట్రల్‌ జైలుతో పాటు అనంతపురం సెంట్రల్‌ జైల్లో ఓపెన్‌ ఎయిర్‌ జైళ్లు ఉండేవి. ఇక్కడ సత్ప్రవర్తన కలిగిన ఖైదీలతో వ్యవసాయం, కూరగాయాలు, పండ్ల తోటలు సాగు చేయించేవారు. అంతేగాకుండా కుటీర పరిశ్రమలు కూడా నిర్వహించేవారు. ఇక్కడ జైలుకు ఎలాంటి గోడ ఉండదు. కేవలం తీగతో నిర్మించిన ఫెన్సింగ్‌ మాత్రమే ఉంటుంది. ఈ వ్యవసాయ క్షేత్రంలో పండించిన పంటల ను ఖైదీల అవసరాలకు పోనూ వారితోనే విక్రయిస్తుంటారు. కుటీర పరిశ్రల ద్వారా జైలు కు ఆదాయం సమకూరుతుంది. ఆ ఆదాయాన్ని అవసరాలను బట్టి జైలు అభివృద్ధి పనులకు ఉపయోగిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత చర్లపల్లి జైల్లోని  వ్యవసాయ క్షేత్రం మాదిరిగానే మరొకటి ఏర్పాటు చేయాలని జైళ్లశాఖ తలంచింది. ఇందులో భాగంగానే హైదరాబాద్‌ తర్వాత రెండో అతి పెద్ద నగరంగా పేరొందిన వరంగల్‌లో ఓపెన్‌ ఎయిర్‌ జైలు నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిసింది. 

ఓపెన్‌ ఎయిర్‌ జైలుతో ఆదాయం...

వరంగల్‌ సెంట్రల్‌ జైల్‌ ఉన్న కాలంలో వ్యవసాయ క్షేత్రంతో పాటు పలు కుటీర పరిశ్రమలు నిర్వహించేవారు. సెంట్రల్‌ జైల్లోని వ్యవసాయ క్షేత్రం, ఆయా పరిశ్రమలు, ఆవరణలో ఉన్న పెట్రోల్‌ బంక్‌లో ఖైదీలు పని చేసేవారు. దీంతో జైళ్లశాఖకు లక్షలాది రూపాయల ఆదాయం సమకూరేది. ఖైదీలకు రోజువారీ ఆదాయం వచ్చేది. ఖైదీల కుటుంబ సభ్యులు ములాఖత్‌లకు వచ్చిన క్రమంలో వారి ఖర్చుల నిమిత్తం అందజేసేవారు. సెంట్రల్‌ జైల్‌ను తొలగించిన తర్వాత వరంగల్‌ జైళ్లశాఖ ఆదాయానికి గండిపడింది. దీనికి తోడు ఖైదీల రోజువారీ సంపాదన కూడా లేకుండా పోయింది. దీంతో వరంగల్‌లో ఓపెన్‌ ఎయిర్‌ జైల్‌ నిర్మించి గతంలోని పరిశ్రమలను తిరిగి నెలకొల్పాలని జైలు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఓపెన్‌ ఎయిర్‌ జైలు నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం ఆయా వర్గాలు ఆనందిస్తున్నాయి. 

త్వరలో పనులు ప్రారంభం..

రాష్ట్ర ప్రభుత్వం మామూనూర్‌లో ఓపెన్‌ ఎయిర్‌ జైలు నిర్మాణానికి అనుమతినిచ్చిన నేపథ్యంలో త్వరలో పనులు ప్రారంభిస్తామని సూపరింటెండెంట్‌ సంపత్‌ తెలిపారు. జైళ్లశాఖ ఆదేశాల మేరకు వ్యవసాయ క్షేత్రం, ఫర్నిచర్‌ ఫ్యాక్టరీ, ఫినాయిల్‌ పరిశ్రలు ఏర్పాటు చే యనున్నట్లు చెప్పారు. అంతేగాకుండా కొత్తగా కోళ్ల పరిశ్రమ, గొర్రెల పెంపకం, డెయిరీ పరిశ్రమతో పాటు నర్సరీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికితోడు పెట్రోల్‌ బంక్‌ను కూడా నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 40 మంది ఓపెన్‌ ఎయిర్‌ ఖైదీలతో పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఈ పరిశ్రమల ద్వారా జైళ్ల శాఖకు ఆదాయం సమకూరడంతోపాటు ఖైదీల భోజన సదుపాయాలు కూడా తీరుతాయన్నారు. 

ములాఖత్‌ తిప్పలు..

ఓపెన్‌ ఎయిర్‌ జైల్‌ ఏర్పాటుకు సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో శిక్షపడిన ఖైదీల కుటుంబ సభ్యులను ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా మునూరులో సెంట్రల్‌ జైల్‌ను నిరిస్తామని చెబుతూ వచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు కేవలం ఓపెన్‌ జైల్‌కు అనుమతులివ్వడంతో వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి ఖైదీలను ఇతర ప్రాంతాల్లోని జైళ్లకు తరలిం చాల్సిన పరిస్థితి రావడంతో, తమవారిని ములాఖత్‌ అవ్వాలంటే, వ్యయ ప్రయాసాలతో కూడుకోనుందని వాపోతున్నారు. కొంతమంది ఖైదీలను హైదరాబాద్‌లోని చర్లపల్లి, చంచల్‌గూడ, ఖమ్మం జైళ్లకు సైతం తరలించడంతో అక్కడికి వెళ్లి కలవడం కష్టతరం మారుతుందని పేర్కొంటున్నా రు. ప్రభుత్వం స్పందించి ముందుగా నిర్ణయించినట్టుగానే సెంట్రల్‌ జైలు ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Read more