ఒక పని తర్వాతే మరొకటి..

ABN , First Publish Date - 2022-09-22T06:05:22+05:30 IST

ఉపాధి హామీ పనుల అమలులో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. చేపట్టిన పనులన్నీ నూటికి నూరు శాతం పూర్తిగా అమలైన తర్వాతనే కొత్త పనులు చేపట్టాలన్న నిబంధనలు విధించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శక సూత్రాలను ఇటీవల విడుదల చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు ఇక నుంచి మారిన నిబంధనలకు అనుగుణంగా పనులు చేపట్టి పూర్తి చేయడానికి వీలుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కొత్త నిబంధనల వల్ల పనులు అసంపూర్తిగా మిగిలిపోవడం అంటు ఉండదు. ఫలితంగా నిధుల వృథా తగ్గుతుంది. అయితే ఈ నిబంధనల వల్ల గ్రామాల్లో పనులు తగ్గి కూలీలకు ఉపాధి లభించని పరిస్థితులు ఏర్పడతాయన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఒక పని తర్వాతే మరొకటి..

ఉపాధి హామీ పథకంలో కొత్త నిబంధనలు
చేపట్టిన పనులు పూర్తయ్యాకే కొత్తవి మొదలు
ప్రతీ విడత 25 పనులకే ప్రతిపాదనలు
ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
కొత్త నిబంధనల అమలుకు అధికారుల కసరత్తు


ఉపాధి హామీ పనుల అమలులో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. చేపట్టిన పనులన్నీ నూటికి నూరు శాతం పూర్తిగా అమలైన తర్వాతనే కొత్త పనులు చేపట్టాలన్న నిబంధనలు విధించింది.  ఇందుకు సంబంధించిన మార్గదర్శక సూత్రాలను ఇటీవల విడుదల చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు ఇక నుంచి మారిన నిబంధనలకు అనుగుణంగా పనులు చేపట్టి పూర్తి చేయడానికి వీలుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.   కొత్త నిబంధనల వల్ల పనులు అసంపూర్తిగా మిగిలిపోవడం అంటు ఉండదు. ఫలితంగా నిధుల వృథా తగ్గుతుంది. అయితే  ఈ నిబంధనల వల్ల గ్రామాల్లో పనులు తగ్గి కూలీలకు ఉపాధి లభించని పరిస్థితులు ఏర్పడతాయన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.

హనుమకొండ, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎ్‌స) 2005 ఆగస్టు 25 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రతీ ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నైపుణ్యం లేని వయోజనులు, అలాగే దారిద్య్రరేఖకు దిగువననున్న వారికి ఉపాధి చూపాలన్న లక్ష్యంతో ఈజీఎస్‌ అమలవుతున్నది. ప్రధానంగా ప్రతీ గ్రామీణ కుటుంబంలో పని కావాలని కోరిన వారికి గ్రామ పరిధిలోనే 100 పని రోజులు కల్పించి కనీస వేతనం వచ్చేలాగా చట్టపరమైన హామీని ఉపాధి హామీ చట్టంలో పొందుపరిచారు.

అసంపూర్తిగా..
మంచి లక్ష్యంతో తెచ్చిన ఉపాధి హామీ పథకం పనులపై పర్యవేక్షణ నామమాత్రం గా ఉండడంతో చాలాచోట్ల ప్రారంభించిన మధ్యలో వదిలేస్తున్నారు. కూలీలకు ఉపాధి కల్పించాలనే ఆతృతతో ఎలాంటి ప్రణాళిక లేకుండా పనులు చేపట్టి వాటిని పూర్తిచేయకుండా వదిలేస్తుండడంతో చాలా గ్రా మాల్లో అసంపూర్తిగా మిగులుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఇలాంటి వాటికి చెక్‌ పట్టేందుకుగాను కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై కొత్త గా నిబంధనలను సవరించింది. ఇకపై ఎలాంటి పనులైనా సరే పూర్తి చేశాకే మరోటి మొదలు పెట్టాల్సి ఉం టుంది. ఈ మేరకు గత జూలై 18న కేంద్రం నుంచి రాష్ట్రానికి ఉత్తర్వులు అందాయి. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ నుంచి ఆదే నెల 26న అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధి హామీలో సవరించిన నిబంధనల మేరకు పంచాయతీల్లో చేపట్టాల్సిన పనుల్లో 20 ఎంపిక చేసి ప్రారంభించి పూర్తి చేయాలి. తరువాత మరో పని చేపట్టాలని ఆ ఉత్తర్వుల్లో తెలిపారు ఈ నెల 1నుంచి ఈ నిబంధన అమలులోకి వచ్చింది. ఉమ్మడి  జిల్లాలో ఈ మేరకు సవరించిన నూతన నిబంధనల ప్రకారం పనులు చేపట్టడానికి గాను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.

పూర్తి చేసిన తర్వాతే..
ఉపాధిహామీలో ఇప్పటివరకు పనులు అవసరమున్నా.. లేకున్నా ప్రతిపాదించి వాటిని ప్రారంభించి పూర్తి చేయకుండా వదిలేసిన సంఘటనలు ఉన్నాయనే ఆరోపణలున్నాయి. ప్రణాళికలేకుండా పనులను ప్రతిపాదిస్తున్న విధానానికి పూర్తిగా చెక్‌ పెట్టడానికిగాను నిబంధనలను సవరించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం పనులను గుర్తించి వాటిని ప్రతిపాదించి, సకాలంలో పూర్తి చేయడానికిగాను కొత్త విధానాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఏకకాలంలో ఆయాగ్రామాల్లో 20 పనులు ప్రారంభించి పూర్తి చేసే వెసులుబాటు కల్పించారు. పంచాయతీలో 20 పనుల కంటే ఎక్కువ ప్రతిపాదించరాదనే నిబంధనలు విధించారు. పనులు పూర్తయిన తరువాత కొత్తవి ప్రతిపాదించి వాటి వివరాలను నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టం (ఎన్‌ఎంఎంఎ్‌స)లో నమోదు చేయాల్సి ఉంటుంది.

విమర్శలు
కేంద్ర ప్రభుత్వం విధించిన ఈ కొత్త నిబంధనల పట్ల మరో పక్క విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ నిబంధనల మూలంగా ఉపాధి పనులు తగ్గే ప్రమాదం ఉందన్న ఆందోళనను కూడా కూలీలు వెలిబుచ్చుతున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇన్నాళ్లు గ్రామాలవారీగా గుర్తించిన పనులకు ఆమోదం పొంది తద్వారా పనులు చేపట్టేవారు. అలాగే ఎన్ని పనులైనా చేసే అవకాశముండేది. ఒక గ్రామానికి ఇన్ని పనులు మాత్రమే చేపట్టాలన్న నిబంధన లేదు. దీంతో కూలీల సంఖ్య ఎక్కవగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ పనులు, అలాగే తక్కువ ఉన్న చోట తక్కువ పనులు చేస్తూ వచ్చారు. ఇంకా అవసరాలకు అనుగుణంగా ఒక గ్రామంలో ఎక్కువ, తక్కువ పనులు చేసేవారు. కానీ కేంద్రం తాగా విధించిన నిబంధనల వల్ల  చేపట్టిన 20 పనులు పూర్తయ్యే వరకు మిగతా పనులు చేపట్టకపోవడం వల్ల కూలీలకు ప్రస్తుతం దొరుకుతున్నన్ని పనిదినాలు ఇక ముందు లభించకపోవవచ్చునన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం ఒక్కో గ్రామంలో 40నుంచి 45కుపైగా పనులు చేపట్టి ఉపాధి కల్పించారు. ఇక నుంచి 20 పనులు మాత్రమే చేయాలన్న నిబంధన వల్ల దాదాపు సగం పనులకు కోత పడే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.

Read more