అక్టోబరు రూ.300 దర్శన కోటా రేపు విడుదల

ABN , First Publish Date - 2022-08-17T10:34:39+05:30 IST

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఈ నెల 18వ తేదీన ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

అక్టోబరు రూ.300 దర్శన కోటా రేపు విడుదల

తిరుమల, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఈ నెల 18వ తేదీన ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అయితే బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తుల సర్వదర్శనానికే ప్రాధాన్యం కల్పించేలా ఆ తొమ్మిదిరోజులకు సంబంధించిన రూ.300 దర్శన టికెట్లను మాత్రం రద్దు చేశారు. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి 18వ తేదీన ఉదయం 9 గంటలకు విడుదల చేసే టికెట్లను బుక్‌ చేసుకోవాలని టీటీడీ కోరింది.

Read more