విద్యుదాఘాతంతో యువకుడి మృతి

ABN , First Publish Date - 2022-08-22T04:27:55+05:30 IST

మండలంలోని నాడాపూర్‌లో ఆదివారం పయ్యావుల చందు (30) అనే ప్రైవేట్‌ టెక్నిషియన్‌ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఎస్సై రాజారెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం డిచ్‌పల్లి మండలం ధర్మారం (బి) గ్రామానికి చెందిన చందు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇంటర్నెట్‌ కేబుల్‌ వైరింగ్‌ కోసం విద్యుత్‌ స్తంభం ఎక్కాడు. 11 కేవీ విద్యుత్‌ తీగలు తగలడంతో అతడు స్తంభంపై నుంచి కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

నవీపేట, ఆగస్టు 21: మండలంలోని నాడాపూర్‌లో ఆదివారం పయ్యావుల చందు (30) అనే ప్రైవేట్‌ టెక్నిషియన్‌ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఎస్సై రాజారెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం డిచ్‌పల్లి మండలం ధర్మారం (బి) గ్రామానికి చెందిన చందు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇంటర్నెట్‌ కేబుల్‌ వైరింగ్‌ కోసం విద్యుత్‌ స్తంభం ఎక్కాడు. 11 కేవీ విద్యుత్‌ తీగలు తగలడంతో అతడు స్తంభంపై నుంచి కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 


Read more