సమన్వయంతో పనిచేయాలి

ABN , First Publish Date - 2022-11-23T23:02:18+05:30 IST

ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌లు, సబ్‌సెంటర్‌లతో సమన్వయంతో పనిచేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుదర్శనం అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ఆయూష్‌ వై ద్యులకు బ్రిడ్జ్‌కోర్స్‌ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఇందిర, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ప్రతిమరాజ్‌ జ్యో తి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సుదర్శనం మాట్లాడుతూ వైద్య ఆరోగ్యవిభాగంలో పనిచేస్తున్న 112 ఆయూష్‌ వైద్యులకు సర్టిఫికెట్‌ ప్రోగ్రాం ఇన్‌ కమ్యూనిటీ కోర్సు 120 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.

సమన్వయంతో పనిచేయాలి

పెద్దబజార్‌, నవంబర్‌ 23: ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌లు, సబ్‌సెంటర్‌లతో సమన్వయంతో పనిచేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుదర్శనం అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ఆయూష్‌ వై ద్యులకు బ్రిడ్జ్‌కోర్స్‌ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఇందిర, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ప్రతిమరాజ్‌ జ్యో తి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సుదర్శనం మాట్లాడుతూ వైద్య ఆరోగ్యవిభాగంలో పనిచేస్తున్న 112 ఆయూష్‌ వైద్యులకు సర్టిఫికెట్‌ ప్రోగ్రాం ఇన్‌ కమ్యూనిటీ కోర్సు 120 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలని సూచించారు. ఈ కోర్సు ద్వారా ఎంతో ఉపయోగకరమైన అంశాలు తెలియజేస్తాయని వాటిని ఆచరణలో ఉంచి అభివృద్ధి చెం దాలని తెలిపారు. ఈశిక్షణ తర్వాత ఆయూష్‌ వైద్యులకు గ్రామీణ ప్రాం తాలలోని రోగులను గుర్తించి చికిత్స అందిస్తారని తెలియజేశారు. డాక్టర్‌ ఇందిరా, ప్రతిమరాజ్‌లు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఇలాంటి కార్యక్రమాల వలన ప్రజలకు మేలు చేయడమేకాకుండా మనకు విజ్ఞాన్ని అభివృద్ధి పర్చుకోవడాన్ని తెలియజేస్తుందన్నారు. ముఖ్యంగా పల్లెల్లో ఆశ కార్యకర్తలతో, అంగన్‌వాడిలో సమన్వయం ఏర్పర్చుకుని రోగులకు మెరుగైన చికిత్స అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-23T23:02:18+05:30 IST

Read more