అన్ని రంగాల్లోనూ మహిళల రాణింపు

ABN , First Publish Date - 2022-09-26T05:46:00+05:30 IST

దేశంలో ఎక్కడచూసిన మహిళలు మగవారి తో సమానంగా అన్ని రంగాల్లో రానిస్తున్నారని ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోఎవర్ధన్‌ అన్నారు. ఆదివారం మండలంలోని కంజర గ్రామ సమీపంలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఆవరణలో 8వ జోనల్‌స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు.

అన్ని రంగాల్లోనూ మహిళల రాణింపు
క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌

ఆర్టీసీ చైర్మన్‌, రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ 

మోపాల్‌, సెప్టెంబరు 25: దేశంలో ఎక్కడచూసిన మహిళలు మగవారి తో సమానంగా అన్ని రంగాల్లో రానిస్తున్నారని ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోఎవర్ధన్‌ అన్నారు. ఆదివారం మండలంలోని కంజర గ్రామ సమీపంలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఆవరణలో 8వ జోనల్‌స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడారంగాల్లో కూడా అగ్రస్థానంలో నిలవాలని అన్నారు. ప్రపంచంలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతోందని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ విద్యా, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని, అందులో భాగంగానే మండలానికోక మోడల్‌ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. తెలంగాణలో 1200 రెసిడెన్షీయల్‌ పాఠశాల లు ప్రారంభించడం జరిగిందని, ప్రతీనెలా వీటికి లక్షా 20వేలు ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. ఈ గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికలు మంచి పరిజ్ఞానంతో ముందుకెళ్లాలన్నారు. వచ్చే సంవత్సరంలో పాఠశాలకు విద్యార్థులు ఆటోలలో వెళ్లకుండా  ఆర్టీసీ బస్సులో వెళ్లేవిధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ మూడు రోజులు జరిగే క్రీడల్లో బాలికలు గెలుపోటములను స్పోర్టివ్‌గా తీసుకోవాలన్నారు. ఈ క్రీడా పోటీల్లో జగిత్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌ పాఠశాలల బాలకలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐడీసీఎంఏ చైర్మన్‌ సంబరి మోహన్‌, ఎంపీపీ లత, జడ్పీటీసీ కమల, ప్రిన్సిపాల్‌ మాధవీలత, రైతు సమన్వయ నాయకులు శ్రీనివాస్‌రావు, సొసైటీ చైర్మన్‌లు ఉమాపతిరావు, మోహన్‌రెడ్డి,  సర్పంచ్‌, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించాలి

ఆర్మూర్‌ రూరల్‌: విద్యార్థులు క్రీడల్లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో సత్తా చాటాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పండిత్‌ వినీత పవన్‌ అన్నారు. ఆదివారం పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాల క్రీడా మైదానంలో రెండవ జోన్‌ పరిధిలో జరిగిన ఎనిమిదవ జోనల్‌ క్రీడా పోటీల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ మానసికోల్లాసానికి, దేహ దారుఢ్యానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తున్నాయన్నారు. ఆరు జిల్లాల నుం చి వివిధ పాఠశాలల క్రీడాకారులు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు.   కార్యక్ర మంలో ఎంపీపీ పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ శేక్‌మున్న, కౌన్సిలర్‌ ఎండి.ఇంతియాజ్‌, జిల్లా ఇంటర్మీడియేట్‌ విద్యా ధికారి రఘురాజ్‌, జిల్లా పాఠశాల ప్రాంతీయ అధికారిణి మేరి ఏసుపాదం, రాజేంద్రప్రసాద్‌, ప్రిన్సిపాల్‌ దుర్గారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-26T05:46:00+05:30 IST