కళాకారులకు అన్ని విధాలా సహకరిస్తాం
ABN , First Publish Date - 2022-12-13T23:49:36+05:30 IST
తెలంగాణ ఉద్యమం మొదలుకొని ప్రతి సందర్భంలో కళాకారులు అందిస్తున్న సేవలు మరువలేవని, కళాకారులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని నగర మేయర్ నీతూకిరణ్, కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు.

నిజామాబాద్ కల్చరల్, డిసెంబరు 13 : తెలంగాణ ఉద్యమం మొదలుకొని ప్రతి సందర్భంలో కళాకారులు అందిస్తున్న సేవలు మరువలేవని, కళాకారులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని నగర మేయర్ నీతూకిరణ్, కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సంగీత కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం కళాకారుల కళారంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి సంస్థ అవార్డులను అందజేసింది. పద్మశ్రీ కిన్నెర మొగలయ్యకు పేరిణి నాట్యచారులు భీమన్ మాస్టర్ పురస్కరాన్ని అందజేశారు. కార్యక్రమంలో సంస్థ గౌరవ అధ్యక్షుడు అలుక కిషన్, టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి అమృత్కుమార్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, కళాకారులు పాల్గొన్నారు.
Read more