ఆనందోత్సాహాల మధ్య వినాయక నిమజ్జనం నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-09-08T06:38:17+05:30 IST

ప్రశాంత వాతావరణంలో ఎలాం టి అపశృతులకు తావులేకుండా గణేష్‌ నిమజ్జనోత్సవాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. బుధవా రం నగరంలో శోభయాత్ర నిర్వహించే మార్గాన్ని కలెక్టర్‌, సీపీ నాగరాజు, అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రాలతో కలిసి పరిశీలించారు. జిల్లాకేంద్రంలోని దుబ్బా నుంచి శోభాయాత్ర ప్రారంభం కానుండగా.. అక్కడ నుంచి

ఆనందోత్సాహాల మధ్య వినాయక నిమజ్జనం నిర్వహించాలి
యంచ గోదావరి వద్ద గణేష్‌ నిమజ్జన ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి, సీపీ నాగరాజు

శోభయాత్ర మార్గాన్ని పరిశీలించిన కలెక్టర్‌, సీపీ

నిజామాబాద్‌ అర్బన్‌, సెప్టెంబరు 7: ప్రశాంత వాతావరణంలో ఎలాం టి అపశృతులకు తావులేకుండా గణేష్‌ నిమజ్జనోత్సవాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. బుధవా రం నగరంలో శోభయాత్ర నిర్వహించే మార్గాన్ని కలెక్టర్‌, సీపీ నాగరాజు, అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రాలతో కలిసి పరిశీలించారు. జిల్లాకేంద్రంలోని దుబ్బా నుంచి శోభాయాత్ర ప్రారంభం కానుండగా.. అక్కడ నుంచి గుర్బాబాదిరోడ్‌, లలితామహాల్‌ థియేటర్‌, గంజ్‌, గాంధీచౌక్‌, పవన్‌ థియేటర్‌, ఖిల్లారెడ్‌, బర్కత్‌పుర, గురుద్వార, పెద్దబజార్‌, కోటగల్లి, గోల్‌హనుమాన్‌, పూలాంగ్‌ చౌరస్తా మీదుగా వినాయక్‌నగర్‌ వినాయకుల బావి వరకు రూట్‌మ్యాప్‌ను పరిశీలించారు. భారీ విగ్రహాలు నిమజ్జనం చేసే మార్గాలైన అర్సపల్లి, సారంగపూర్‌, జాన్కంపేట్‌, నవీపేట, యంచ గ్రామాల మీదుగా బాసరబ్రిడ్జీ వరకు మార్గాన్ని పరిశీలించారు. ఆ తర్వాత సీపీ నాగరాజు మాట్లాడుతూ నిమజ్జనోత్సవం సందర్భంగా కమిటీలను ఏర్పా టు చేశామని, ప్రశాంత వాతావరణంలో శోభాయాత్ర జరుపుకుని జిల్లాకు మంచిపేరు తీసుకురావాలన్నారు. వీరి వెంట ఆర్‌డీవో రవి, ఏసీపీ వెంకటేశ్వర్లు, సార్వజనిక్‌ గణేష్‌ మండలి ప్రతినిధులు బంటు గణేష్‌, శ్రీనివాస్‌, మున్సిపల్‌ అధికారులు, తదితరులు ఉన్నారు.

యంచ గోదావరి వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

నవీపేట: ఈనెల 9న జరిగే గణేష్‌ నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి కోరారు. బుధవారం పోలీస్‌ కమిషనర్‌ నాగరాజు, అడిషనల్‌ కలెక్టర్‌ చిత్ర మిశ్రాలతో కలిసి ఆయన యంచ గోదావరి వద్ద గణేష్‌ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ నారాయణరెడ్డి మాట్లాడుతూ యంచ గోదావరి వద్ద గణేష్‌ నిమజ్జనం కోసం ఐదు క్రేన్‌లను ఏర్పాటు చేస్తున్నామని, అలాగే ముందు జాగ్రత్తగా గజఈతగాళ్లను సిద్ధంగా ఉంచడం జరిగిందన్నారు. వీటితో పాటు లైటింగ్‌, శానిటేషన్‌, మెడికల్‌, తాగునీటి వసతి ఏర్పాట్లను కూడా చేపట్టడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి సుమారు రెండు వేల వినాయక విగ్రహాలు యంచ గోదావరిలో నిమజ్జనాలు చేసే అవకాశాలున్నాయని ఆయన అన్నారు. గణేష్‌ నిమజ్జనం సందర్భంగా విద్యుత్‌, రోడ్డు ప్రమాదాలతో పాటు నీటిలో ప్రమాదాలు జరుగకుండా అధికారులతో పాటు ప్రతీఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గణేష్‌ నిమజ్జనం కోసం వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సేవలను వినియోగించుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ నాగరాజు మాట్లాడుతూ గణేష్‌ నిమజ్జనానికి సంబంధించిన రూట్‌ మ్యాప్‌ను గురువారంలోగా విడుదల చేయడం జరుగుతుందని, గణేష్‌ మండపాల నిర్వాహకులు పోలీస్‌ శాఖకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో నిజామాబాద్‌ ఆర్డీవో రవి, అడిషనల్‌ సీపీ అరవింద్‌బాబు, ఏసీపీ వెంకటేశ్వర్‌, తహసీల్దార్‌ వీర్‌సింగ్‌,  ఎస్సై రాజారెడ్డి, సర్పంచ్‌ లహరి ప్రవీణ్‌కుమార్‌, తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-09-08T06:38:17+05:30 IST