ఉపాధి హామీ, పల్లె ప్రగతి పనుల రికార్డుల తనిఖీ

ABN , First Publish Date - 2022-12-13T23:56:08+05:30 IST

మండలంలోని నల్లవెల్లి గ్రామంలో సోమవారం జడ్పీ సీఈవో గోవింద్‌ పర్యటించారు. గ్రామ పంచాయతీ రికార్డులు, ఉపాధిహామీ పనులు, పల్లెప్రగతి పనులను పరిశీలించారు.

ఉపాధి హామీ, పల్లె ప్రగతి పనుల రికార్డుల తనిఖీ

ఇందల్‌వాయి, డిసెంబరు 13 : మండలంలోని నల్లవెల్లి గ్రామంలో సోమవారం జడ్పీ సీఈవో గోవింద్‌ పర్యటించారు. గ్రామ పంచాయతీ రికార్డులు, ఉపాధిహామీ పనులు, పల్లెప్రగతి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధిహామీలో చేపట్టిన పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. పల్లెప్రగతిలో భాగంగా చేపట్టిన వైకుంఠధామం, డంపింగ్‌యార్డ్‌, పల్లె ప్రగతి పనులు ఎలా కొనసాగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఎప్పటికప్పుడు తడి,పొడి చెత్త సేకరించాలన్నారు. గ్రామంలో ఎక్కడ కూడా చెత్త చెదారం పేరుకోకుండా చూడాలని అన్నారు. సీజనల్‌ వ్యాధులు వ్యాప్తి చెందుతుండడంతో గ్రామం శుభ్రం ఉంచేలా చూడాల్సిన బాద్యత గ్రామపంచాయతీ పాలక వర్గందేనని అన్నారు. కార్యక్రమంలో ఆయన వెంట ఎంపీడీవో రాములునాయక్‌, సర్పంచ్‌ విజయలక్ష్మారెడ్డి, ఉపసర్పంచ్‌ బాబు శరత్‌, తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-12-13T23:56:08+05:30 IST

Read more