వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-09-27T06:27:47+05:30 IST

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ 127వ జయంతి సందర్భంగా నగరంలోని వినాయక్‌నగర్‌లో గల ఆమె విగ్రహానికి కలెక్టర్‌, నగర మేయర్‌ నీతుకిరణ్‌, ఇతర అధికారులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించా రు.

వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలి : కలెక్టర్‌
ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పిస్తున్న కలెక్టర్‌

ఘనంగా ఐలమ్మ 127వ జయంతి

నిజామాబాద్‌ అర్బన్‌, సెప్టెంబరు 26: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ 127వ జయంతి సందర్భంగా నగరంలోని వినాయక్‌నగర్‌లో గల ఆమె విగ్రహానికి కలెక్టర్‌, నగర మేయర్‌ నీతుకిరణ్‌, ఇతర అధికారులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించా రు. అనంతరం బీసీ అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో పాత కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌లో ఆమె జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి కలెక్టర్‌, తదితరులు పూలమాలలు వేసి నివాళ్లు అ ర్పించారు. 1940 దశకంలో చాకలి ఐలమ్మ పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేశారని, మహిళ అయిఉండి తన హక్కుల కోసం పోరాడిన ఆమె స్ఫూర్తిని నేటితరం ఆదర్శంగా తీసుకుని అన్నిరంగాల్లో రాణించాలన్నారు. ఈ సందర్భంగా ఆయా కుల సంఘాల ప్రతినిధులు తమ సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకురాగా తమ పరిధిలో ఉన్నవాటిని త ప్పనిసరిగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, వివిధ కుల సంఘాల ప్రతినిదులు పాల్గొన్నారు.

ప్రజావాణికి 39 వినతులు

ప్రజావాణి వినతులకు ప్రాధాన్యతనిస్తూ వెంట వెంటనే వాటిని పరిష్కరించాలని కలెక్టర్‌ నారయాణరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 39 ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్ట ర్‌ చంద్రశేఖర్‌, డీఆర్‌డీవో చందర్‌నాయక్‌, డీపీవో జయసుధ, జడ్పీ సీఈ వో గోవింద్‌లు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుం చి వినతులు స్వీకరించారు. ఆర్జీలను పెండింగ్‌లో పెట్టకుండ ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతు వెంటనే పరిష్కారం అయ్యేలా సంబందిత అధికారులు చొరవచూపాలని కలెక్టర్‌ అదికారులను కోరారు. 

కాగా, జిల్లాలో నిబంధనలు పాటించని వాటర్‌ ప్లాంట్‌లను సీజ్‌చేయాలని కలెక్టర్‌ సంబంధిత అదికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించా రు. జిల్లాలో వాల్టా చట్టం పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని సంబంధిత శాఖల అధికారులకు స్పష్టం చేశారు. 

Read more