రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల మృతి

ABN , First Publish Date - 2022-11-17T00:34:17+05:30 IST

నవీ పేట శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్ద రు బాలురు మృ తి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గా యాలయ్యాయి. నిజామాబాద్‌ నార్త్‌ రూరల్‌ సీఐ నరహరి, స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నవీపేటకు చెందిన దొండి ఉదయ్‌ (15), సాయితేజ (15) బైక్‌పై అభంగపట్నంకు చెందిన తమ స్నేహితుడిని దింపివేసి తిరిగి నవీపేటకు వస్తున్నారు. ఇదే సమయంలో మండలంలోని మహంతంకు చెందిన నీరడి గోపాల్‌, సాయిలు అనే ఇద్దరు వీఆర్‌ఏలు రాంగ్‌ రూట్‌లో నవీపేట నుంచి అభంగపట్నం వైపు బైక్‌పై వస్తున్నారు. రోడ్డుపై ఉన్న ధాన్యం కుప్పల వద్ద రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల మృతి

నవీపేట, న వంబరు 16: నవీ పేట శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్ద రు బాలురు మృ తి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గా యాలయ్యాయి. నిజామాబాద్‌ నార్త్‌ రూరల్‌ సీఐ నరహరి, స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నవీపేటకు చెందిన దొండి ఉదయ్‌ (15), సాయితేజ (15) బైక్‌పై అభంగపట్నంకు చెందిన తమ స్నేహితుడిని దింపివేసి తిరిగి నవీపేటకు వస్తున్నారు. ఇదే సమయంలో మండలంలోని మహంతంకు చెందిన నీరడి గోపాల్‌, సాయిలు అనే ఇద్దరు వీఆర్‌ఏలు రాంగ్‌ రూట్‌లో నవీపేట నుంచి అభంగపట్నం వైపు బైక్‌పై వస్తున్నారు. రోడ్డుపై ఉన్న ధాన్యం కుప్పల వద్ద రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వీఆర్‌ఏలు ధాన్యం కుప్పల వైపు పడిపోగా వారికి తీవ్ర గాయాలు కాగా ఇదే సమయంలో మరో బైక్‌పై ఉన్న బాలురు ఇద్దరు రోడ్డుపై పడిపోయారు. ఇదే సమయంలో నిజామా బాద్‌ నుంచి మహారాష్ట్రలోని జాల్నాకు పాత ఇనుమ సామాను లోడ్‌తో వెళుతున్న లారీ వేగంగా వచ్చి రోడ్డుపై పడి ఉన్న బాలురపై నుంచి దూ సుకెళ్లింది. దీంతో బాలురు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెంది దొండిఉదయ్‌ స్థానిక మోడల్‌ పాఠశాలలో 8వ తరగతి చదు వుతుండగా సాయితేజ స్కాలర్స్‌ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నా డు. మృతుడు ఉదయ్‌ తండ్రి గోపి వ్యాన్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మరో మృతుడు సాయితేజ తల్లి సుధారాణి మండలంలోని యంచ పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నారు. వీరి స్వగ్రామం వికారాబాద్‌ జిల్లా తాండూ రు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. గాయపడిన ఇద్దరు వీఆర్‌ఏలను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రాజారెడ్డి ఉన్నారు.

Updated Date - 2022-11-17T00:34:17+05:30 IST

Read more