జాతీయ రహదారిపై ట్రాక్టర్‌ బోల్తా : ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2022-10-11T05:49:50+05:30 IST

జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసు కుంది. జాతీయ రహదారిపై లారీని తప్పించే క్రమంలో ట్రాక్టర్‌ బోల్తా పడింది.

జాతీయ రహదారిపై ట్రాక్టర్‌ బోల్తా : ఇద్దరు మృతి


కామారెడ్డి, అక్టోబరు 10 : జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసు కుంది. జాతీయ రహదారిపై లారీని తప్పించే క్రమంలో ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాలీలో ఉన్న ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.  దేవునిపల్లి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నెల్లూరు జిల్లాకు చెంది న ఐదుగురు కూలీలు ఏడుకొం డలు, శ్రీనివాస్‌, కోలయ్య, జ్యో తి, చెంచయ్య రామారెడ్డి మం డలం మోషంపూర్‌ లోని ఇటు కల బట్టీలో పని చేస్తున్నారు. సోమవారం సాయంత్రం ఇటుక బట్టీ నుంచి కామారెడ్డి పట్టణానికి ట్రాక్టర్‌లో ఇటుకల లోడ్‌ను తీసుకెళ్లారు. లోడ్‌ దిం పి తిరిగి వస్తుండగా కామారెడ్డి మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డి వద్ద 44వ నెంబర్‌ జాతీ య రహదారిపై ఎదురుగా వస్తున్న లారీ త ప్పించే క్రమంలో ట్రాక్టర్‌ బోల్తా పడింది. దీంతో ట్రాలీలో ఉన్న జ్యోతి(25), చెంచ య్య(35) అక్కడికక్కడే మృతి చెందారు. ఏడుకొండలు, శ్రీనివాస్‌, కోలయ్యలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని కామారెడ్డి ప్రభు త్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Read more