సీసీ టీవీ పుటేజీ ఆధారంగా దొంగ పట్టివేత

ABN , First Publish Date - 2022-02-19T05:53:31+05:30 IST

తాళం వేసిన ఇళ్లలో చోరీకి పాల్పడిన దొంగను సీసీటీవీ పుటేజీ ఆధారంగా పట్టుకున్నట్లు సీపీ కెఆర్‌.నాగరాజ్‌ తెలిపారు.

సీసీ టీవీ పుటేజీ ఆధారంగా దొంగ పట్టివేత


ఆర్మూర్‌టౌన్‌, ఫిబ్రవరి18: తాళం వేసిన ఇళ్లలో చోరీకి పాల్పడిన దొంగను సీసీటీవీ పుటేజీ ఆధారంగా పట్టుకున్నట్లు సీపీ కెఆర్‌.నాగరాజ్‌ తెలిపారు. శుక్ర వారం ఆర్మూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ న వివరాలు వెల్లడించారు. నారాయపేట్‌ జిల్లా దామరగిద్ద మండలం కందెన పల్లి గ్రామానికి చెందిన రవికుమార్‌ గతంలో హైదరాబాద్‌లోని పలు ఇళ్లల్లో చోరీకి పాల్పడి 14 కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లాడు. 2017లో విడుదలై భార్య, పి ల్లలతో కలిసి ఆర్మూర్‌లోని తిరుమలకాలనీలో నివాసముంటున్నాడు. ఇక్కడ కూ డా ఐదు ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం ఆర్మూర్‌ మామిడిపల్లి రైల్వేస్టేషన్‌ రోడ్డులో రవికుమార్‌ అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసు లు పట్టుకొని విచారించగా నేరం ఒప్పుకోవడంతో నిందితుడి నుంచి 13తులాల ఆరు గ్రాముల బంగారం, కిలో 300 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనప ర్చుకున్న ట్లు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. కేసును ఛే దించిన ఎస్సై శ్రీకాంత్‌, ఐడీ పార్టీ సిబ్బంది కె.గంగాప్రసాద్‌, డి.ప్రసాద్‌, ఎం. వినయ్‌ను అభినందించి రివార్డులు అందజేశారు. కార్యక్రమంలో ఏసీపీ రఘు, స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ టి.శ్రీధర్‌, ఎస్సైలు శ్రీకాంత్‌, యాదగిరిగౌడ్‌, పాల్గొన్నారు.

Read more