ధాన్యాన్ని త్వరగా మిల్లింగ్‌ చేయాలి

ABN , First Publish Date - 2022-11-23T23:31:41+05:30 IST

మిల్లింగ్‌లలో మిల్లర్లు ధాన్యాన్ని త్వరగా మిల్లింగ్‌ చేయాలని అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ తెలిపారు.

ధాన్యాన్ని త్వరగా మిల్లింగ్‌ చేయాలి
రైసుమిల్లులో వడ్లను పరిశీలిస్తున్న అదనపు చంద్రమోహన్‌రెడ్డి

నిజాంసాగర్‌, నవంబరు 23: మిల్లింగ్‌లలో మిల్లర్లు ధాన్యాన్ని త్వరగా మిల్లింగ్‌ చేయాలని అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ తెలిపారు. బుధవారం మండలంలోని అచ్చంపేట, మాగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి, మాగి రైసుమిల్లును పరిశీలించి, ఽధాన్యాన్ని పరిశీలించారు. సీఎంఆర్‌కు ధాన్యం పంపాల న్నారు. అచ్చంపేట విండో పరిధిలో ఇప్పటి వరకు ఎన్ని క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశా రన్నారు. 1310 మంది రైతుల నుంచి లక్షా 93వేల 500 బస్తాలు కొనుగోలు చేశామన్నారు. ఇప్పటి వరకు లక్ష బస్తాల డబ్బులు చెల్లించేం దుకు ఎంట్రీ చేయడం జరిగిందని విండో కార్యదర్శి సంగమేశ్వర్‌ వివరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తూకం వేయాల న్నారు. విండో కార్యదర్శులు పర్యవేక్షించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఆయన వెంట విండో చైర్మన్‌ నర్సింహారెడ్డి, తహసీల్దార్‌ నారా యణ, ఏవో అమర్‌ప్రసాద్‌, రైతులు తదితరులున్నారు.

రైతులకు సమస్యలు లేకుండా కొనుగోలు చేయాలి

పిట్లం: మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ పరిశీలించారు. ఆయన బుధవారం పిట్లం, రాంపూర్‌, ఆయా గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలు, రైసుమిల్లులను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సమస్యలు లేకుండా కొనుగోలు చేయాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట డీసీవో వసం త, క్లరష్‌ అధికారి మురళీధర్‌గౌడ్‌, విండో అధ్య క్షుడు శపథంరెడ్డి, కార్యదర్శి సంతోష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-23T23:31:52+05:30 IST