విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి

ABN , First Publish Date - 2022-10-18T05:39:51+05:30 IST

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి ఉన్నతస్థాయికి చేరుకోవాలని డీఈవో రాజు తెలిపారు.

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి

కామారెడ్డిటౌన్‌, అక్టోబరు 17: విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి ఉన్నతస్థాయికి చేరుకోవాలని డీఈవో రాజు తెలిపారు. సోమవారం దేవునిపల్లి ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ జనాభా విద్యావిభాగం ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష రోల్‌ప్లే పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం చదువులోనే కాకుండా కలలు, సాంస్కృతిక సాహిత్య రంగాలలో పిల్లలు ప్రతిభ చూపించాలని అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులు వారిని సన్నద్ధం చేయాలని తెలిపారు.ఈ పోటీల్లో ప్రథమ బహుమతిని కామారెడ్డి జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల, ద్వితీయ బహుమతిని రాజంపేట బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు,తృతీయ బహుమతిని ఇసాయిపేట ఉన్నత పాఠశాల విద్యార్థులు గెలుచుకున్నారు. కార్యక్రమంలో సమగ్ర జిల్లా అకాడమిక్‌ మానిటరింగ్‌ అధికారి వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.


Read more