Suicide: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య..

ABN , First Publish Date - 2022-08-23T20:57:33+05:30 IST

నిర్మల్ జిల్లా (Nirmal Dist.): బాసర ట్రిపుల్ ఐటీ (Basara Triple IT)లో విషాదం నెలకొంది.

Suicide: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య..

నిర్మల్ జిల్లా (Nirmal Dist.): బాసర ట్రిపుల్ ఐటీ (Basara Triple IT)లో విషాదం నెలకొంది. విద్యార్థి సూసైడ్ (Suicide) చేసుకున్నాడు. హాస్టల్ గదిలో విద్యార్థి సురేష్ (Suresh) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూసైడ్‌కు గల కారణాలు తెలియరాలేదు. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న సురేష్‌ స్వస్థలం నిజామాబాద్ జిల్లా. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.


కాగా ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థి సురేష్‌ ఆత్మహత్య చేసుకున్నా అధికారులు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Read more