నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2022-11-30T00:10:08+05:30 IST
నేరాల నియంత్రణలో తగు చర్యలు తీసుకోవాలని ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులకు సూచించారు.

ఎల్లారెడ్డి,నవంబరు 29: నేరాల నియంత్రణలో తగు చర్యలు తీసుకోవాలని ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులకు సూచించారు. మంగళవారం ఎల్లారెడ్డి డీఎస్పీ కార్యాలయ పరిధిలో గల పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు.అంతకముందు రికార్డులను పరిశీలించి ఫిర్యాదులు వచ్చిన వెంటనే చార్జి షీట్లను నమోదుచేయాలని తెలిపారు. నేరస్తులను పట్టుకోవడానికి సీసీకెమెరాలు ఎంతో ఉపయోగకరమని ఎప్పటికప్పుడు వాటి పనితీరును పరిశీలించాలని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్‌లు, సీఐ శ్రీనివాస్, రామన్, ఎస్ఐలు గణేష్, శంకర్, రాజేష్, ఆంజనేయులు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Read more