కొచ్చెర మైసమ్మ ఆలయంలో స్పీకర్‌ పూజలు

ABN , First Publish Date - 2022-11-27T23:50:22+05:30 IST

మండలంలోని మైలారం గ్రామ శివారులోని కొచ్చెర మైసమ్మ ఆలయంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు.

కొచ్చెర మైసమ్మ ఆలయంలో స్పీకర్‌ పూజలు
కొచ్చెర మైసమ్మ ఆలయం వద్ద మాట్లాడుతున్న స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

నస్రుల్లాబాద్‌, నవంబరు 27: మండలంలోని మైలారం గ్రామ శివారులోని కొచ్చెర మైసమ్మ ఆలయంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ప్రత్యేక నైవేద్యాలను సమర్పించిన అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు.

నేడు నస్రుల్లాబాద్‌లో స్పీకర్‌ పర్యటన

స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సోమవారం నస్రుల్లాబాద్‌ మండలంలో పర్యటించనున్నట్లు టీఆర్‌ఎస్‌ నాయకులు తెలిపారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. మండలంలోని బొప్పాస్‌పల్లిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారని వివరించారు.

భగవద్గీతను ఉర్దూ భాషలోకి తర్జుమా చేసిన ఫాతిమా

బాన్సువాడ: స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ఆయన నివాసంలో నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణానికి చెందిన ముస్టిం యువతి ఫాతిమా ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి భగవద్గీతను ఉర్దూ భాషలోకి తర్జుమా చేసిన ఫాతిమాను అభినందించి వ్యక్తిగతంగా ఆమెకు రూ.50వేల ఆర్థిక సహాయం అందించారు.

స్పీకర్‌ను కలిసిన ముదిరాజ్‌ సంఘ సభ్యులు

బాన్సువాడ టౌన్‌: పాత బాన్సువాడ ముదిరాజ్‌ సంఘ సభ్యులు ఆదివారం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. పెద్దమ్మ ఆలయ నిర్మాణం పనులు సగం వరకే పూర్తయ్యాయని స్పీకర్‌ దృష్టికి తీసుకవచ్చారు. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు 20లక్షల నిధులు ఇస్తానని ప్రకటించడంతో సంఘ సభ్యులు స్పీకర్‌ పోచారంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2022-11-27T23:50:24+05:30 IST