బైక్‌పై నుంచి పడి ఒకరి మృతి

ABN , First Publish Date - 2022-04-24T05:49:45+05:30 IST

మండలంలోని మద్దెల్‌చెర్వు-పిట్లం రహదారిపై అన్నారం గేటు సమీపంలో బొందిలి మహేందర్‌సింగ్‌(40) అనే వ్యక్తి ద్విచక్రవాహనం పైనుండి పడి అక్కడికక్కడె మృతి చెందినాడని ఎస్సై రంజిత్‌ తెలిపారు.

బైక్‌పై నుంచి పడి ఒకరి మృతి


పిట్లం, ఏప్రిల్‌ 23: మండలంలోని మద్దెల్‌చెర్వు-పిట్లం రహదారిపై అన్నారం గేటు సమీపంలో బొందిలి మహేందర్‌సింగ్‌(40) అనే వ్యక్తి ద్విచక్రవాహనం పైనుండి పడి  అక్కడికక్కడె మృతి చెందినాడని ఎస్సై రంజిత్‌ తెలిపారు.ఎస్సై తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం అన్నారం గేటు సమీపంలో నం దిపేట్‌ మండలం నూత్‌పల్లి గ్రామానికి చెందిన బొందిలి మహేందర్‌సింగ్‌ అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై నూత్‌పల్లి  గ్రామం నుంచి పెద్దకోడప్గల్‌ గ్రామానికి వె ళ్తున్నాడు. అన్నారం గేటు వద్ద ప్రమాదశాత్తు రోడ్డుపై పడిపోయాడు. దీంతో అతడి తలకు బలమైన గాయాలు కావడంతో తాకడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Read more