సామాజిక తనిఖీని పకడ్బందీగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-11-23T22:58:14+05:30 IST

ఉపాధిహామీ పథకం ద్వారా చేపట్టిన పనులపై సామాజిక తనిఖీని పకడ్బందీగా చేపట్టాలని జిల్లా విజిలెన్స్‌ అధికారి నారాయణ సూచించారు. బుధవారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. 2019 అక్టోబరు 1 నుంచి 2022 మార్చి 31 వరకు సామాజిక తనిఖీని చేపట్టాలని పేర్కొన్నారు.

సామాజిక తనిఖీని పకడ్బందీగా నిర్వహించాలి

వర్ని, నవంబరు 23: ఉపాధిహామీ పథకం ద్వారా చేపట్టిన పనులపై సామాజిక తనిఖీని పకడ్బందీగా చేపట్టాలని జిల్లా విజిలెన్స్‌ అధికారి నారాయణ సూచించారు. బుధవారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. 2019 అక్టోబరు 1 నుంచి 2022 మార్చి 31 వరకు సామాజిక తనిఖీని చేపట్టాలని పేర్కొన్నారు. వివిధ రకాల రిజిష్టర్ల నిర్వహణ, గ్రామస్థాయిలో జాబ్‌ కార్డుల అప్డేట్‌లపై అవగాహన కల్పించారు. వర్క్‌ఫైల్‌ నిర్వహణ, వర్క్‌ సైడ్‌ బోర్డు ఏర్పాటు విధానాన్ని వివరించారు. సమావేశంలో జిల్లా అధికారి శ్రీనివాస్‌, ఎంపీడీవో బషీరుద్దీన్‌, ఎంపీవో అరుణ్‌, చందర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-23T22:58:14+05:30 IST

Read more