రైల్వే అండర్‌ బ్రిడ్డి పనులు అస్తవ్యస్తం

ABN , First Publish Date - 2022-05-30T06:48:30+05:30 IST

జిల్లాకేంద్రం నుంచి ఆర్మూర్‌ వైపు, ఆర్మూర్‌ ప్రాంతం నుంచి జిల్లాకేంద్రానికి చేరుకునేందుకు ఒకే దారి ఉండ డంతో నిత్యం రైల్వేకమాన్‌ వద్ద ట్రాఫిక్‌ ఇబ్బందులను గమనించి 2013లో అప్పటి ప్రభుత్వం రైల్వేఅండర్‌ బ్రిడ్జి మంజూరు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టెండర్‌లు

రైల్వే అండర్‌ బ్రిడ్డి పనులు అస్తవ్యస్తం
నిర్మాణ పనులు పూర్తయిన రైల్వే అండర్‌బ్రిడ్జి ఇదే..

రెండేళ్లుగా కొనసాగుతున్న నిర్మాణ పనులు 

బ్రిడ్జి పూర్తయినా పూర్తికాని రోడ్డు 

నిత్యం అవస్థలు పడుతున్న నగరవాసులు

నిజామాబాద్‌ అర్బన్‌, మే 29: జిల్లాకేంద్రం నుంచి ఆర్మూర్‌ వైపు, ఆర్మూర్‌ ప్రాంతం నుంచి జిల్లాకేంద్రానికి చేరుకునేందుకు ఒకే దారి ఉండ డంతో నిత్యం రైల్వేకమాన్‌ వద్ద ట్రాఫిక్‌ ఇబ్బందులను గమనించి 2013లో అప్పటి ప్రభుత్వం రైల్వేఅండర్‌ బ్రిడ్జి మంజూరు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టెండర్‌లు పిలిచి రైల్వేబ్రిడ్జిను కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా 2017లో పూర్తిచేయగా.. అప్పటి నుంచి ఇతర రోడ్డు పనుల నిర్మాణం జాప్యం కారణంగా నిత్యం ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌జామ్‌ అవుతోంది. గత ఆరు నెలలుగా ట్రాఫిక్‌ను మళ్లించి పను లు చేస్తున్నప్పటికీ.. పూర్తికాకపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం, మధ్యాహ్న సమయాల్లో నిత్యం వందలాది వాహనాలు నిలిచిపోతుండడంతో ఆ ప్రాంతం అంతా ట్రాఫిక్‌ జామ్‌ అవుతుంది. బ్రిడ్జి నిర్మాణం పూర్తై దాదాపు ఐదేళ్లు గడుస్తున్నా.. దానికి  లింకుచేసే రోడ్ల నిర్మాణం మాత్రం సవ్యంగా కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. రైల్వే అండ ర్‌ బ్రిడ్జిని 2013లో అప్పటి ప్రభుత్వం మంజూరు చేయగా.. టెండర్‌లు పూర్తయి నిర్మాణం చేపట్టిన రైల్వేశాఖ 2017లో బ్రిడ్జికి నిధులు మంజూరు చేసింది. 2020లో నిర్మాణం పూర్తిచేసి రోడ్డు భవనాల శాఖకు అప్పగించినప్పటికీ గత ఐదేళ్లుగా పనులు జరుగుతూనే ఉన్నాయి. 2020లో బ్రిడ్జ్‌ నిర్మాణం పూర్తయిన్పటికీ రోడ్ల పనులు మాత్రం ఆశించినమేర వేగంగా జరగడంలేదు. కరోనా కారణంగా కొన్ని రోజుల పాటు పనులు నిలిపివేసినప్పటికీ దాదాపు 10 నెలలుగా పనులు జరుగుతున్నా.. పనులలో మాత్రం పురోగతి కనిపించడంలేదు. రోజురోజుకు నిర్మాణ వ్యయం పెరిగిపోతున్నప్పటికీ పనులు వేగంగా జరగడంలేదు. 

కమాన్‌ వద్ద ట్రాఫిక్‌జామ్‌ నిత్యకృత్యం

నిత్యం వేలాది వాహనాలు నగరానికి వస్తుంటాయి. ముఖ్యంగా ఆర్మూర్‌ ప్రాంతం నుంచి వచ్చేవారు రైల్వేకమాన్‌ గుండానే నగరానికి వస్తారు. నిత్యం ఉదయం సాయంత్రం వేళల్లో వేలాది వాహనాలు వస్తుండడంతో ట్రాఫిక్‌జామ్‌ అవుతుంది. గత నెలవరకు పాఠశాలలు తెరచి ఉండడం తో ఉదయం పూట వారితో ట్రాఫిక్‌జామ్‌ అయ్యేది. మళ్లీ వచ్చే నెలలో పాఠశాలలు ప్రారంభమయ్యే అవకాశం ఉండడంతో మళ్లీ ట్రాఫిక్‌ కష్టాలు తప్పేలా లేవు. గత డిసెంబర్‌లో కంఠేశ్వర్‌ నుంచి పెద్దవాహనాలను దారి మళ్లించి నిర్మాణ పనులు వేగంగా చేస్తామని చెప్పినా పనులు మాత్రం జరగడం లేదు. నేడు, రేపు అంటూ బ్రిడ్జి ప్రారంభాన్ని వాయిదా వేస్తున్నారు. దీంతో బ్రిడ్జి ప్రారంభం ఎప్పుడనే అనుమానాలు నగరవాసులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్ప టికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు జోక్యం చేసుకుని బ్రిడ్జిని త్వరగా ప్రారంభించాలని నగరవాసులు కోరుతున్నారు. 

త్వరలోనే పూర్తి : రాంబాబు, ఆర్‌ అండ్‌ బి అధికారి

ఇప్పటికే బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యింది. బ్రిడ్జికి లింకు చేసే రోడ్ల పనులు దాదాపు పూర్తికావచ్చాయి. చిన్నచిన్న పనులు పెండింగ్‌లో ఉన్నాయి. త్వరలోనే వాటిని పూర్తిచేసి బ్రిడ్జిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. 

Read more