వానాకాలం ప్రణాళిక సిద్ధం

ABN , First Publish Date - 2022-04-24T06:43:29+05:30 IST

జిల్లాలో వానాకాలం సాగుకు వ్యవసాయశాఖ అధి కారులు ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లాలో ఉన్న భూగర్భజల వనరులు, ప్రాజెక్టులు, చెరువులు, రిజర్వాయర్‌ల పరిధిలో సాగు విస్తీర్ణం వివరాలను గ్రామాల వారీగా ప్రణాళికలో పొందుపర్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను పంపారు.

వానాకాలం ప్రణాళిక సిద్ధం

జిల్లా వ్యాప్తంగా 5,44,350 ఎకరాలు సాగవనుందని అధికారుల అంచనా

జూన్‌లోపు ఎరువులు, విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు

ఆరుతడి పంటల సాగుకు ప్రోత్సహిస్తున్న అధికారులు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో వానాకాలం సాగుకు వ్యవసాయశాఖ అధి కారులు ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లాలో ఉన్న భూగర్భజల వనరులు, ప్రాజెక్టులు, చెరువులు, రిజర్వాయర్‌ల పరిధిలో సాగు విస్తీర్ణం వివరాలను గ్రామాల వారీగా ప్రణాళికలో పొందుపర్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను పంపారు. ఈ ప్రణాళికకు అనుగుణంగా వానాకాలం సాగుకు ఎన్ని విత్తనాలు, ఎరువులు అవసరమో ప్రభుత్వానికి పంపిన నివేదికల్లో పేర్కొన్నారు. ఆరుతడి పంటలతో పాటు కొత్త పంటలను ప్రోత్సహించేందుకు గ్రామీణ ప్రాంతంలో రైతులకు అవగాహన కల్పించేందుకు మే నెలలో ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

  వాణిజ్య పంటల సాగుకు ఏర్పాట్లు..

జిల్లాలో వానాకాలంలో వరితో పాటు కొత్త పంటల సాగుకు రైతులను ప్రోత్సహించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. మిర్చి, పత్తి, కంది కొంత మొత్తంలో సా గు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  మిర్చి, పత్తికి మార్కెట్‌లో డిమాండ్‌ ఎక్కువగా ఉండడంతో రైతులకు మేలు జరిగే అవకాశం ఉండడంతో ఆరుతడి పంటల్లో భాగంగా ఈ పంటను సాగు చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా రు. పప్పు ధాన్యాలకు డిమాండ్‌ పెరుగుతున్నందున కంది కూడా కొంతమొత్తంలో సాగు చేసేందుకు వ్యవసాయశాఖ తరఫున రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.

 పెరగనున్న వరి సాగు విస్తీర్ణం..

జిల్లాలో వచ్చే వానాకాలంలో 5 లక్షల 44వేల 350ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. భూగర్భ జలాలతో పాటు ప్రాజెక్టులో నీళ్లు ఉండడం వల్ల జిల్లాలో వరి విస్తీర్ణం మరింత పెరుగుతుందని అంచ నా వేశారు. వచ్చే వానాకాలంలో 3లక్షల 97వేల 500 ఎకరాల వరకు వరి సాగయ్యే అవకాశం ఉందని ప్రణాళికలో పొందుపర్చారు. వరి విత్తనాలతో పాటు ఎరువులు ఎంతమేర అవసరమో ప్రభుత్వానికి సిఫారసు చేశారు. వానాకాలంలో సన్నాలతో పాటు దొడ్డు రకాలను కూడా సాగు చేసే అవకాశం ఉండడంతో ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

  63 వేల ఎకరాల్లో సోయా సాగు..

జిల్లాలో వరితో పాటు వానాకాలంలో సోయా కూడా ఎక్కువ మొత్తంలో సాగవుతుందని అంచనా వేశారు. జిల్లాలో గడిచిన కొన్నేళ్లుగా సోయా దిగుబడి తగ్గినా ఈ సంవత్సరం 62వేల 500 ఎకరాల వరకు సాగవుతుందని అంచనా వేశారు. సబ్సిడీపై విత్తనం పంపిణీ చేస్తే మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. వానాకాలంలో ఈ రెండు పంటలతో పాటు మొక్కజొన్న 37వేల 500 ఎకరాలు, పత్తి 1750 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేశారు. కందులు 2375 ఎకరాలు, పెసర 225 ఎకరాలు, మినుము 325 ఎక రాలు, వేరుశనగ 500, చెరకు వెయ్యి ఎకరాలు, ఉద్యానవన పంట లు 7925 ఎకరాలతో పాటు ఇతర పంటలు వేస్తారని అధికారులు ప్రణాళికలో పొందుపర్చారు. మొత్తం సాగు విస్తీర్ణంలో దాదాపు 75 శాతం వరకు వరి సాగవుతుందని అంచనాకు వచ్చారు.వానాకాలంలో యూరియా 87079 మె ట్రిక్‌ టన్నులు, డీఏపీ 11480, ఎంవోపీ 10198, కాం ప్లెక్స్‌ ఎరువులు 35758, ఎస్‌ఎస్‌ పీ 1131 మెట్రిక్‌ టన్నులు అవసరముంటుందని అంచనా వేశారు. 

పెరగనున్న పంటల సాగు విస్తీర్ణం..

జిల్లాలో నీటి వనరులు ఎక్కువగా ఉండడం వల్ల పంటల విస్తీర్ణం పెరగనుందని జేడీఏ మేకల గోవింద్‌ తెలిపారు. గత సంవత్సరంకంటే 40వేల ఎక రాలు అదనంగా సాగు పెరగనుందన్నారు. వరి విస్తీ ర్ణం కూడా పెరుగుతుందన్నారు. ఈ వానాకాలంలో పత్తి, మిర్చి, కంది సాగును ప్రోత్సహించేందుకు ప్రయత్నా లు చేస్తున్నామని ఆయన తెలిపారు. 

Read more