అటల్‌ మారథన్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌లో పాల్గొనాలి

ABN , First Publish Date - 2022-02-19T05:54:47+05:30 IST

జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల విద్యార్థులు అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ ఆధ్వర్యంలో జాతీయస్థాయి అటల్‌ మారథన్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌లో పాల్గొనాలని డీఈవో దుర్గాప్రసాద్‌ శుక్రవాఆరం ఒక ప్రకటనలో తెలిపారు.

అటల్‌ మారథన్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌లో పాల్గొనాలి


నిజామాబాద్‌అర్బన్‌, ఫిబ్రవరి 18: జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల విద్యార్థులు అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ ఆధ్వర్యంలో జాతీయస్థాయి అటల్‌ మారథన్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌లో పాల్గొనాలని డీఈవో దుర్గాప్రసాద్‌ శుక్రవాఆరం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌ద్వారా నిర్వహించే ఈ ఛాలెంజ్‌లో తరగతితో సంబంధం లేకుండా విద్యార్థులు పాల్గొనవచ్చని తెలిపారు. మార్చి 6వ తేదీలోగా విద్యార్థులు ఇన్నోవేట్‌.మైజీవోవి.ఇన్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ఆరోగ్య సంరక్షణ, పోషణ, అందరికి అందుబబాటులో విద్య, శక్తి, రవాణా, సామాజిక అభివృద్ధి అనే అంశాలలో ఆవిష్కరణలను విద్యార్థులు పంపేవిధంగా ప్రధానోపాధ్యాయులు, గైడ్‌ టీచర్లు విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. వివరాలకు జిల్లా సైన్స్‌ అదికారి గంగాకిషన్‌ 9848219365 నెంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.

Read more