అమలుకు నోచుకోని ఆపరేషన్‌ ఛబుత్రా

ABN , First Publish Date - 2022-07-05T06:27:31+05:30 IST

జిల్లాలో నేరల అదుపుతోపాటు అర్ధరాత్రి బైక్‌రైడింగ్‌ చేస్తూ జులాయిగా తిరుగుతున్న యువతను సన్మార్గంలో నడిపించేందుకు చేపట్టిన ‘ఆపరేషన్‌ ఛబుత్రా’ అమలుకు నోచుకోవడం లేదు. అసాంఘిక కార్యక్రమాలను అదుపులో పెట్టేందుకు, యువతను సన్మార్గంలో నడిపించేందుకు పోలీసులు ఆపరేషన్‌ ఛబుత్రా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

అమలుకు నోచుకోని ఆపరేషన్‌ ఛబుత్రా

పెరుగుతున్న నేరాలు

పట్టించుకోని అధికారులు

ఖిల్లా, జూలై 4: జిల్లాలో నేరల అదుపుతోపాటు అర్ధరాత్రి బైక్‌రైడింగ్‌ చేస్తూ జులాయిగా తిరుగుతున్న యువతను సన్మార్గంలో నడిపించేందుకు చేపట్టిన ‘ఆపరేషన్‌ ఛబుత్రా’ అమలుకు నోచుకోవడం లేదు. అసాంఘిక కార్యక్రమాలను అదుపులో పెట్టేందుకు, యువతను సన్మార్గంలో నడిపించేందుకు పోలీసులు ఆపరేషన్‌ ఛబుత్రా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే కొద్ది రోజులుగా పోలీసులు ఈ కార్యక్రమంపై నిర్లక్ష్యం వహించడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో తిరిగి యువకులు, రాత్రి వేళలలో యఽథేచ్ఛగా సంచరించడం మొదలు పెట్టారు. పోలీసు శాఖ హెచ్చరికలు బేఖాతరు చేస్తున్నారు.

350మంది యువతను పట్టుకున్న పోలీసులు

పోలీసు కమిషనర్‌ కేఆర్‌.నాగరాజు ఆదేశాల మేరకు నిజామాబాద్‌ ఏసీపీ ఏ.వెంకటేశ్వర్‌ తన సిబ్బందితో ఈ కార్యక్రమాన్ని మే 20న చేపట్టారు. ఈ ఆపరేషన్‌ ఛబుత్రా కార్యక్రమం వల్ల ఒకేరోజు సుమారు 350మంది అనవసరంగా రాత్రి తిరుగుతున్న యువకులను పట్టుకున్నారు. వీరిని జిల్లా కేంద్రంలోని పరేడ్‌గ్రౌండ్‌లో తీసుకొచ్చి తెల్లవార్లు వారిని అక్కడే ఉంచి ఉదయం 8గంటల ప్రాంతంలో కౌన్సెలింగ్‌ నిర్వహించి వదిలి పెట్టారు. అయితే పోలీసు శాఖ ద్వారా ఎటువంటి చర్యలు లేకపోవడంతో పట్టుబడిన వారు తేలింగా తీసుకుంటున్నారు. ప్రతీ వారం ఆపరేషన్‌ ఛబుత్రా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పిన పోలీసులు గాలికి వదిలి వేశారు.

ఆపరేషన్‌ ఛబుత్రా నిర్వహిస్తాం..  వెంకటేశ్వర్‌, ఏసీపీ

నేరాల అదుపునకు పోలీసు శాఖ నిర్వహించే ఆపరేషన్‌ ఛబుత్రా కార్యక్రమం తిరిగి ప్రారంభిస్తాం. యువత రాత్రి వేళలో అనవసరంగా తిరుగకుండా అన్ని చర్యలు తీసుకుంటాం.

పీఎఫ్‌ఐ సంస్థ సానుభూతిపరుడి అరెస్టుa

ఖిల్లా: నిషేధిత పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ (పీఎఫ్‌ఐ) సానుభూతి పరుడిని ఆరవ టౌన్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆయన వద్ద నుంచి వెదురుబొంగు కర్రలు, మూడు నాంచాలు, 3సెట్ల లూస్‌ పేపర్లను స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ అరవింద్‌బాబు తెలిపారు. సోమవారం పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. ఆటోనగర్‌లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు ఓ ఇంట్లో సోదా లు చేశామన్నారు. సోదాల్లో ఖాదర్‌ను అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. కొంత కాలంగా ఆటోనగర్‌లో ఉంటూ యువకులను సంస్థ కార్యకలాపాలపై ప్రోత్సహిస్తూ ఇప్పటికీ రెండు వందల మంది యువకులను దీని కార్యకలాపాలపై శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. జగిత్యాలకు చెందిన అబ్దుల్‌ ఖాదర్‌ కొంతకాలంగా ఆటోనగర్‌లోని ఉస్మానియ మసీదు వద్ద కరాటే మాస్టర్‌గా స్థిర పడ్డారన్నారు. పైకి మాత్రం సామాజిక కార్యకలాపాలు చేస్తూ అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించేవాడని తెలిపారు. ఖాదర్‌పై 141,120/ఏ,120-బి.153-ఏ, 141ఆర్‌/డబ్ల్యూ34, ఐపీసీ 13(1)(బి), చట్టవ్యతిరేక కార్యకలాపాలు (ముందస్తు) యాక్ట్‌-1967 ప్రకారం కేసులు నమోదు చేసి కోర్టు ఎదుట హాజరు పర్చి రిమాండ్‌కు తరలిస్తామన్నారు. ఈ సమావేశంలో నిజామాబాద్‌ ఏసీపీ ఆరే.వెంకటేశ్వర్‌, సీఐలు జగడం నరేష్‌, శ్రీశైలం, ఎస్‌ఐలు సాయికుమార్‌గౌడ్‌, లింబాద్రి, సిబ్బంది ఉన్నారు.

Read more