హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు

ABN , First Publish Date - 2022-08-18T05:01:53+05:30 IST

కొమిరి లక్ష్మి(80)ని ఆమె మనమడు కొమిరి గంగాధర్‌ హత్యచేసినందున జీవిత కారాగార శిక్ష విధిస్తూ జడ్జి సునీత కుంచాల బుధవారం తీర్పు చెప్పారు. కోర్టు కానిస్టేబుల్‌ లింబాద్రి తెలిపిన వివరాల ప్రకారం.. భీంగల్‌ మండలంలో మెండోరా గ్రామానికి చెందిన లక్ష్మికి ముగ్గురు కుమారులు ఉన్నారన్నారు.

హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు

నిజామాబాద్‌లీగల్‌, ఆగస్టు 17: కొమిరి లక్ష్మి(80)ని ఆమె మనమడు కొమిరి గంగాధర్‌ హత్యచేసినందున జీవిత కారాగార శిక్ష విధిస్తూ జడ్జి సునీత కుంచాల బుధవారం తీర్పు చెప్పారు. కోర్టు కానిస్టేబుల్‌ లింబాద్రి తెలిపిన వివరాల ప్రకారం.. భీంగల్‌ మండలంలో మెండోరా గ్రామానికి చెందిన లక్ష్మికి ముగ్గురు కుమారులు ఉన్నారన్నారు. చిన్నకొడుకు భూమ న్న చనిపోవడంతో అతడి కుమారుడు గంగాధర్‌ తన ఇంటిలోనే వేరొక గ దిలో నివసించేవాడని తెలిపారు. రోజు మద్యంతాగి వచ్చి గొడవపడేవాడన్నారు. ఎన్నిసార్లు సర్టిచెప్పిన ఇబ్బంది గురిచేస్తుందని భావించి ఆ మె ఇంటికి వచ్చే సమయంలో కరెంటు సప్లై తీగను కట్‌చేసి 29 ఫిబ్రవరి 2020న మధ్యాహ్నం ఇంట్లో పడుకున్న నాయనమ్మ ముఖంపై ఇటుకలతో కొట్టి హత్యచేశాడని తెలిపారు. లక్ష్మి కుమారుడు కొమిరి నడ్మి గంగారాం భీంగల్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారని తెలిపారు. సాక్ష్యాధారాలతో కోర్టులో ధృవీకరించినందున కోర్టులో పీపీ రవిరాజు నేరారోపణ రుజువుపర్చడంతో యావజ్జీవ కారాగా ర శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.


Updated Date - 2022-08-18T05:01:53+05:30 IST