చెరువులో నీట మునిగి ఒకరి మృతి
ABN , First Publish Date - 2022-04-24T05:50:12+05:30 IST
మండలకేంద్రంలోని సౌదర్చెరువులో నీటమునిగి ఒడ్డెర సాయిలు(38) అనే వ్యక్తి మృతిచెందినట్లు ఎస్సై శ్రీధర్‌రెడ్డి తెలిపారు.

బిచ్కుంద, ఏప్రిల్ 23: మండలకేంద్రంలోని సౌదర్చెరువులో నీటమునిగి ఒడ్డెర సాయిలు(38) అనే వ్యక్తి మృతిచెందినట్లు ఎస్సై శ్రీధర్‌రెడ్డి తెలిపారు. మండల కేంద్రానికి చెందిన సాయిలు శుక్రవారం చేపలు పట్టేందుకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. శనివారం మృతుడి కుటుంబసభ్యులు చెరువులో వెతుకగా శవమై తెలినట్లు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదుచేసినట్టు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.